మరోసారి కాల్పులకు తెగబడ్డ పాక్: మేజర్‌ సహా ముగ్గురు మృతి

పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత జవాన్లపై కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో భారత మేజర్‌తోపాటు ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది.

జమ్ముకశ్మీర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత జవాన్లపై కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో భారత సైన్యానికి చెందిన ఒక మేజర్‌తోపాటు ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది.

కశ్మీర్‌లోని బెటాలియన్ ఏరియాకు దగ్గర్లో ఉన్న కెరీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాక్ సైన్యం ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సైనిక అధికారి ఒకరు వెల్లడించారు.

pakistan-ceasefire-violation

గురు, శుక్రవారాల్లో కూడా పాక్ ఇలాగే భారత సైన్యంపై కాల్పులు జరిపింది. నియంత్రణ రేఖ వెంబడి రాజౌరీలోని నౌషెరా సెక్టార్, లాన్ సెక్టార్‌లో పాక్ సైన్యం ఇలాగే భారత జవాన్లపై హఠాత్తుగా కాల్పులు జరిపింది.

ఇక శనివారం జరిపిన ఈ ఆకస్మిక దాడిలో మేజర్‌తో పాటు ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా.. సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+