'పాకిస్థాన్‌ జిందాబాద్'.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్?

పహల్గాం ఉగ్రదాడితో పాకిస్థాన్ - భారత్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరగవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. ఇరు దేశాల సరిహద్దులో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు పాకిస్థాన్ పై ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాక్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో ఉన్నారు. ఈ క్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

ఇటీవల పాకిస్థాన్ తో యుద్ధం అవసరం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. మరోసారి ఆయన కీలక కామెంట్స్ చేశారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా ఎవరైనా మాట్లాడితే అది తప్పు అని, అలాంటి నినాదాలు ఇస్తే అది దేశద్రోహమేనని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఈ క్రమంలో ఆయన నుంచి ఇలాంటి ప్రకటన వెలువడటం చర్చనీయాంశంగా మారింది.

Pakistan Zindabad Is Wrong Karnataka CM Siddaramaiah s Strong Remarks Spark Debate

మంగళూరులో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ లో 'పాకిస్థాన్ జిందాబాద్' అని నినాదాలు చేసినందుకు ఒక వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

"మంగళూరులో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా చెలరేగిన వివాదంలో ఓ వ్యక్తి పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదం ఇవ్వడంతో అతడ్ని దాదాపు 20 మంది కలిసి కొట్టి చంపారు. అతను పాకిస్థాన్ జిందాబాద్ నినాదం ఇవ్వడం కరెక్ట్ కాదు. అతను అలా చేసి ఉండకూడదు. కానీ కొంతమంది అలా చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఆ వ్యక్తిని కొట్టి చంపడం కూడా కరెక్ట్ కాదు. దీనిపై ఇప్పటికే కొందర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాం. మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడవుతాయి" అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

ఈ ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి పరమేశ్వర.. అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. దాడికి పాల్పడిన 20 మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారని సీఎం తెలిపారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇటీవల కూడా సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్‌తో యుద్ధానికి తాము అనుకూలంగా లేమని అన్నారు. శాంతిగా ఉండటంతో పాటు ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలని, కేంద్రం భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ముఖ్య కారణం భద్రతా వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+