'ఆ దేశం వెళ్తే చంపేస్తారు.. ఇక్కడే ఉంటా'.. భారత్ లో కవలలకు జన్మనిచ్చిన పాక్ మహిళ
పాకిస్థాన్ కు చెందిన ఓ మహిళ భారత్ లో కవల పిల్లలకు జన్మనిచ్చింది. హరియాణా ఫరీదాబాద్ జిల్లాలోని బాద్ షా ఖాన్ సివిల్ ఆస్పిటల్ లో ఆమెకు కవలలు జన్మించారు. ఆమెకు పండంటి మగ బిడ్డ, ఆడబిడ్డ పుట్టారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. అయితే తాను పాకిస్థాన్ వెళ్లనని ఇక్కడే ఉంటానని చెబుతోంది. తనకు భారత్ లో ఎలాంటి సమస్య లేదని ఇక్కడే ఉంటానని చెప్పుకొచ్చింది. ఆమె తన భర్తతో కలిసి టూరిస్ట్ వీసాతో భారత్ కు వచ్చారు. ఆమె వీసా గడువు జూన్ లో ముగిసిపోయింది. అయితే తాము మాత్రం ఇక్కడే ఉంటామని ఇక్కడ అన్ని సౌకర్యాలు వసతులు ఉన్నాయని.. పాకిస్థాన్ లో సౌకర్యాలు.. వసతులు లేవని ఆ భార్యాభర్తలు తెలిపారు.
भारत में पाकिस्तानी महिला ने जुड़वां बच्चों को दिया जन्म, बोली– “अब यहीं चाहिए ....https://t.co/ZqRLrHCzuF#santoshmishra75 #cgbhaskar
— SANTOSH MISHRA (@SANTOSHMISHRA75) July 22, 2025
పాకిస్థాన్ కు చెందిన హిందూ మహిళ దుర్గ.. తన భర్త పురుషోత్తంతో కలిసి గతేడాది దిల్లీ వచ్చారు. ఆమె పూర్వికులు పాకిస్థాన్ నుంచి 50 ఏళ్ల క్రితమే భారత్ కు వలస వచ్చారు. దిల్లీలోని భాటి మైన్స్ లో పనిచేస్తున్నారు. అయితే గతేడాది తన భర్తతో కలిసి దుర్గ దిల్లీలోని భాటి మైన్స్ కు వలస వచ్చారు. అయితే వాళ్ల వీసా గడువు జూన్ తో ముగిసింది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అలాగే పాకిస్థాన్ దేశస్థులను తిరిగి ఆ దేశానికి పంపించింది. అటారీ- వాఘా బోర్డర్ నిలిపివేసింది. అయితే దుర్గ, ఆమె భర్త పురుషోత్తం మాత్రం పాకిస్థాన్ వెళ్లలేదు. తాజాగా ఆమె హరియాణా ఫరీదాబాద్ జిల్లాలోని బాద్ షా ఖాన్ సివిల్ ఆస్పిటల్ లో ఆమెకు కవలలకు జన్మనిచ్చింది.

ఆమె తాజాగా మాట్లాడుతూ.. తాను హిందువుని భారత్ లోనే ఉంటానని.. అక్కడకు వెళ్తే చంపేస్తారని తెలిపింది. భారత్ లోనే సౌకర్యాలు, వసతులు బాగున్నాయని.. తనకు ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవని.. భారత్ లోనే ఉంటామని చెప్పింది. దుర్గ భర్త పురుషోత్తం మాట్లాడుతూ.. మేము టూరిస్టు వీసాతో భారత్ వచ్చాం. భాటి మైన్స్ లో పనిచేస్తున్నాం. అదే గనిలో గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ కు చెందిన చాలా కుటుంబాలు పనిచేస్తున్నాయి. కానీ ఏ పాకిస్థానీ కూడా ఆ దేశానికి వెళ్లాలని కోరుకోవడం లేదు. ఇక్కడే సౌకర్యాలు బాగున్నాయి. నేను పండిట్ ను. హిందువులను అక్కడ చంపేస్తున్నారు. మేము పాకిస్థాన్ వెళ్లం. ఇక్కడే ఉంటాం. మాకు ప్రభుత్వం ఆశ్రయం కల్పించాలి.. అని పురుషోత్తం కోరారు.












Click it and Unblock the Notifications