చిన్నారిని రేప్ చేసిన నిందితుడికి 5గుంజీళ్ళ శిక్ష... ఇదెక్కడి న్యాయం భయ్యా!!
న్యాయ వ్యవస్థను అవహేళన చేసిన ఒక షాకింగ్ ఘటన బీహార్లోని నవడాలో చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని నవడాలో ఒక ఐదు సంవత్సరాల చిన్నారిని అత్యాచారం చేసిన ఒక నిందితుడికి ఐదు గుంజీళ్ళ శిక్ష విధించారు అక్కడి పంచాయతీ పెద్దలు. అక్బర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవడా గ్రామంలో ఐదేళ్ల బాలికపై అరుణ్ పండిట్ అనే వ్యక్తి కొన్నాళ్ళ క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడు.
గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను ప్రలోభపెట్టి కోళ్ల ఫారం కి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చిన మైనర్ బాలిక కొద్దిరోజుల తర్వాత ఏం జరిగిందో కుటుంబ సభ్యులకు చెప్పడంతో, కుటుంబ సభ్యులు పంచాయతీ పెద్దలను ఆశ్రయించారు. అయితే పంచాయతీ పెద్దలు నిందితులను పోలీసులకు అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ అందుకు విరుద్ధంగా పంచాయతీ పెద్దలు షాకింగ్ పనిష్మెంట్ నిందితుడికి ఇవ్వడం అక్కడి వారందరినీ ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది.

కేవలం ఐదు గుంజిళ్లు తీయించి అతడిని వదిలి పెట్టాలని పంచాయతీ పెద్దలు తీర్మానం చేయడంతో స్థానికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి వేసిన శిక్ష ఇదేనా? బాలికకు చేసే న్యాయం ఇదేనా? అంటూ లోలోపల మదనపడ్డారు. నవంబర్ 21వ తేదీన పంచాయితీ నేపథ్యంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 14 సెకన్ల నిడివి ఉన్న వైరల్ వీడియోలో అత్యాచార నిందితుడు గుంజిళ్ళు తీశాడు. ఆపై స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు.
ఇక ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు ఈ ఘటనపై స్పందించకపోవడం స్థానికులనే కాకుండా ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది. అసలు పంచాయితీ పెద్దలు ఒక బాలిక శీలానికి ఐదు గుంజీళ్ళ విలువ కట్టడం ప్రతి ఒకరి మనసును బాధిస్తుంది. ఇదెక్కడి న్యాయం భయ్యా అంటూ స్థానికులు ఒకరిలో ఒకరు చర్చించుకునేలా చేస్తుంది. ఇప్పటికైనా పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకొని సదరు బాలికకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నారి జీవితాన్ని నాశనం చేసిన కామాంధుడికి తగిన శిక్ష పడాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications