కమల్ హాసన్ ను కాల్చి చంపాలి: పండిట్ అశోక్ మీద చెన్నైలో కేసు, హిందూ ఉగ్రవాదం ఎఫెక్ట్ !

హిందూ ఉగ్రవాదం లేదని చెప్పలేం అన్న హీరో కమల్కమల్ హాసన్ ను కాల్చి చంపాలి, లేదా ఉరి తియ్యాలి, హిందూ మహాసభపండిట్ అశోక్ శర్మా మీద కేసు పెట్టిన తమిళనాడు పాలు సరఫరా సక్షేమ సంఘం

చెన్నై: దేశంలో హిందూ ఉగ్రవాదం లేదని చెప్పలేమని, నోరు ఎత్తి ప్రశ్నించిన వారి మీద ఎదురుదాడికి దిగుతున్నారని ప్రముఖ బహుబాష నటుడు, దర్శకుడు కమల్ హాసన్ చెప్పడంతో అతన్ని కాల్చి చంపాలి, లేదా ఉరి తియ్యాలని సంచలన వ్యాఖ్యలు చేసిన హిందూ మహాసభ నాయకుడు పండిట్ అశోక్ శర్మా మీద కేసు నమోదు అయ్యింది.

హీరో కమల్ హాసన్ ను కాల్చి చంపాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని, వెంటనే హిందూ మహాసభ నాయకుడు పండిట్ అశోక్ శర్మా మీద కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు పాలు సరఫరా సక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్ ఏ. పొన్నుస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Pandit Ashok Sharma says Kamal Haasan shoud be shot dead, complaint filed in Chennai

చెన్నై నగర పోలీసు కమిషనర్ ఏకే. విశ్వనాథన్ ను కలిసిన ఎస్.ఏ. పొన్నుస్వామి లిఖితపూర్వకంగా హిందూ మహాసభ నాయకుడు పండిట్ అశోక్ శర్మా మీద ఫిర్యాదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేశారు. అనంతరం పొన్నుస్వామి మీడియాతో మాట్లాడారు.

దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా కమల్ హాసన్ మీద పండిట్ అశోక్ శర్మా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. హీరో కమల్ హాసన్ ను కాల్చి చంపాలని పండిట్ అశోక్ శర్మా చెప్పారని, కాల్చి చంపండి అంటే హత్య చెయ్యాలని రెచ్చగొట్టినట్లు అవుతుందని ఆరోపించారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు పండిట్ అశోక్ శర్మా మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెన్నై నగర పోలీసు కమిషనర్ విశ్వనాథన్ కు ఫిర్యాదు చేశామని పొన్నుస్వామి వివరించారు. పండిట్ అశోక్ శర్మా మీద ఫిర్యాదు చేశారని విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెన్నై నగర పోలీసు కమిషనర్ విశ్వనాథన్ మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+