అడ్డుకున్నారు.. గందరగోళం సృష్టించారు.. పళని ఎమ్మెల్యేలకు 'పన్నీర్' సెగ

చెన్నైలోని ఈసీఆర్ రోడ్డులో పళని వర్గం ఎమ్మెల్యేలను పన్నీర్ వర్గం కార్యకర్తలు అడ్డుకున్నారు. నానా గంద‌ర‌గోళం సృష్టించి ప‌ళ‌నిస్వామికి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని నినాదాలు చేశారు.

చెన్నై: మరికొద్దిసేపట్లో తమిళనాడు పాలిటిక్స్ లో మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. నువ్వా? నేనా? అన్నట్లు సాగుతూ వస్తోన్న అన్నాడీఎంకె పాలిటిక్స్ లో ఎడతెగని సంక్షోభానికి నేటి బలనిరూపణతో పూర్తిగా తెరపడిపోతుందా?.. లేక మరో హైడ్రామాకు తెరలేస్తుందా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవడానికి తన మద్దతుదారులను, అన్నాడీఎంకె కార్యకర్తలను పన్నీర్ సెల్వం పళని వైపుకు ఎక్కుపెట్టారు గానీ ఆ పాచిక అంతగా పారేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే గోల్డెన్ బే రిసార్టు నుంచి అసెంబ్లీకి బయలుదేరిన పళని వర్గం ఎమ్మెల్యేలకు పన్నీర్ మద్దతుదారుల సెగ తగిలింది.

Panneer selvam supporters tried to attack Palaniwami MLAs

చెన్నైలోని ఈసీఆర్ రోడ్డులో పళని వర్గం ఎమ్మెల్యేలను పన్నీర్ వర్గం కార్యకర్తలు అడ్డుకున్నారు. నానా గంద‌ర‌గోళం సృష్టించి ప‌ళ‌నిస్వామికి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలపై దాడికి కూడా యత్నించడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఉద్రిక్తతలను అరికట్టేందుకు పోలీసుల రంగప్రవేశం చేశారు.

ఆందోళనకారులను చెదరగొట్టి ప్రత్యేక భద్రత నడుమ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి చేర్చారు. ప్రస్తుతం అసెంబ్లీ చుట్టుపక్కల కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. అదనపు బలగాలను సైతం రంగంలోకి దింపిన పోలీస్ యంత్రాంగం భద్రతను పటిష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+