నోట్ల రద్దు షాకింగ్: స్పీకర్ పైకి పేపర్లు విసిరేసిన ఎంపీ

గురువారం నాడు స్పీకర్ సుమిత్రా మహాజన్ పైన సమాజ్‌వాది పార్టీ ఎంపీ పేపర్లు విసిరారు. తద్వారా సభలో దారుణంగా వ్యవహరించారు.

న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో పార్లమెంటు ఇరు సభల్లో గందరగోళం చెలరేగుతోంది. గురువారం నాడు స్పీకర్ సుమిత్రా మహాజన్ పైన సమాజ్‌వాది పార్టీ ఎంపీ పేపర్లు విసిరారు. తద్వారా సభలో దారుణంగా వ్యవహరించారు.

నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడాలని లోకసభలో ప్రతిపక్షాలు మొదటి నుంచి పట్టుబడుతున్నాయి. గురువారం సభ ప్రారంభం కాగానే విపక్ష పార్టీ ఎంపీలు స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు.

గురువారం నాడు స్పీకర్ సుమిత్రా మహాజన్ పైన సమాజ్‌వాది పార్టీ ఎంపీ పేపర్లు విసిరారు. తద్వారా సభలో దారుణంగా వ్యవహరించారు.

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అక్షయ్ యాదవ్‌ కాగితాలు చించి స్పీకర్‌పైకి విసిరారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. స్పీకర్‌ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు గాను అక్షయ్ యాదవ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు ఎంపీలు డిమాండ్‌ చేశారు.

పెద్దనోట్లను రద్దు చేయడంపై ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చర్చకు వచ్చి సమాధానాలు చెప్పాలంటూ ఉభయసభల్లో ఆందోళన చేయడంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+