Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోదీ కాళ్లు మొక్కిన పపువా ప్రధాని

న్యూఢిల్లీ/పోర్ట్ మోరెస్బీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం- జపాన్, పపువా న్యూగినియా, ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. జపాన్ పర్యటనను ముగించుకున్న ఆయన తాజాగా పపువా న్యూగినియాలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. తన పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానితో భేటీ కావాల్సి ఉంది.

జపాన్‌లోని హిరోషిమాలో ఏర్పాటైన జీ7 సభ్య దేశాల అత్యున్నత స్థాయి సమ్మిట్‌లో మోదీ పాల్గొన్నారు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్‌కు ఇందులో సభ్యత్వం ఉంది. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా.. వంటి దేశాలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నాయి. తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆయా దేశాధినేతలు, ప్రధానమంత్రులతో భేటీ అయ్యారు.

Papua New Guinea PM James Marape touches PM Modis Feet at airport after his arrival

జపాన్ పర్యటన ముగిసిన వెంటనే ఆయన అక్కడి నుంచి పపువా న్యూగినియాకు బయలుదేరి వెళ్లారు. ఆ దేశ రాజధాని పోర్ట్ మోరెస్బీలోని జాక్సన్స్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధానమంత్రి జేమ్స్ మరాపె స్వయంగా ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి స్వాగతం పలికారు.. రెడ్ కార్పెట్ పరిచారు. ఆయన గౌరవార్థం పపువా న్యూగినియా కళాకారులు తమ దేశ జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఆ దేశ సైన్యం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. విమానం నుంచి కిందికి దిగిన వెంటనే జేమ్స్ మరాపె.. మోదీకి సాదర స్వాగతం పలికారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ వెంటనే మోదీకి పాద నమస్కారం చేశారు. కాళ్లు మొక్కి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ- ఆయన భుజాన్ని తట్టారు. జేమ్స్ మరాపె భుజాలను పట్టి పైకి లేపి, మరోసారి ఆలింగనం చేసుకున్నారు. అక్కడి నుంచి తన కాన్వాయ్ వైపు కదిలారు మోదీ.

జేమ్స్ మరాపె.. ప్రధాని మోదీకి పాద నమస్కారం చేయడానికి కారణం లేకపోలేదు. భారత ప్రధాని ఆ దేశ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు భారత ప్రధానులెవ్వరూ పపువా న్యూగినియాలో పర్యటించలేదు. తొలిసారిగా తమ దేశ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని కావడం వల్ల మోదీకి జేమ్స్ మరాపె పాదాలను నమస్కరించి స్వాగతం పలికారు.

తన పర్యటన సందర్భంగా మోదీ- ఫోరమ్ ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. సోమవారం ఈ అత్యున్నత భేటీ ఏర్పాటు కానుంది. ఈ ఫోరమ్‌లో కుక్ ఐలండ్స్, ఫిజీ, కిరిబాటి, రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలండ్స్, మైక్రోనేషియా, నౌరు, నియు, పలావు, పపువా న్యూగినియా, సమోవా, సాల్మన్ ఐలండ్స్, టోంగా, టువాలు, వనవాటు ఉన్నాయి. 2014లో మోదీ తన ఫిజీ పర్యటన సందర్భంగా ఈ ఫోరమ్‌ను ప్రారంభించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+