వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ చేతులెత్తేశారు: కంచి ఘటనపై పరిపూర్ణానంద ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paripoornananda Swami
హైదరాబాద్: కంచి పీఠాధిపతుల అరెస్టుపై నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డిని కలిస్తే తన చేతిలో ఏమీ లేదని చెప్పారని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి గురువారం మండిపడ్డారు. కంచి స్వాములను పాండిచ్చేరి కోర్టు నిర్దోషులుగా తేల్చిన కోర్టు, వారినే లక్ష్యంగా విచారణ జరిగిందని దర్యాఫ్తు సంస్థ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పరిపూర్ణానంద స్వామి విలేకరులతో మాట్లాడారు. కంచి స్వాములను అరెస్టు చేసినప్పుడు వైయస్‌ను కలిస్తే తన చేతుల్లో ఏమీ లేదన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైయస్ సిఎంగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో కంచి స్వామి అరెస్టు జరిగిందని గుర్తు చేశారు.

కంచి స్వామి అరెస్టు అరిష్టాలకు దారి తీస్తుందని తాము ఆనాడే హెచ్చరించామన్నారు. కంచి స్వామి కేసులో తమిళనాడు పోలీసుల తీరును కోర్టు కూడా తప్పు పట్టిందన్నారు. తమిళనాడు పోలీసులు హిందూమతాన్ని కించపర్చేలా నిస్సిగ్గుగా వ్యవహరించారని నిప్పులు చెరిగారు. హిందూ ధర్మాన్ని దెబ్బతీసేందుకు దండం పట్టుకున్న యతీశ్వరులను అరెస్టు చేస్తున్నారని విమర్శించారు.

ఇస్లామిక్ విశ్వవిద్యాలాయన్ని తిరుపతిలోనే ఎందుకు పెట్టాలన్నారు. ఇస్లామిక్ విశ్వవిద్యాలయం పెట్టేందుకు ఎన్నో ప్రాంతాలు ఉండగా కావాలని తిరుపతిలో పెట్టడమేమిటన్నారు. ఓ మతక్షేత్రం వద్ద అన్యమత చిత్రాలు ఉండటం వివాదాలకు ఆజ్యం పోయడమే అన్నారు. తిరుపతిని లక్ష్యంగా పెట్టుకున్న ఉగ్రవాదులు పుత్తూరులో పట్టుబడ్డారన్నారు. ప్రభుత్వాలు హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకొని పని చేస్తున్నాయని ఆరోపించారు.

English summary
Sree Peetham seer Paripoornananda Swami on Thursday fired at Tamilnadu police for Kanchi seer arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X