వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటాబయటా చుట్టూ చిక్కు: రాహుల్‌గాంధీ వేకప్ గేమ్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంటులో తోటి ఎంపీలతో కలిసి పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. రాహుల్ గాంధీ పైన అనేక ఒత్తిళ్లు ఉన్నాయని, అందుకే ఆయన వేకప్ గేమ్ మొదలు పెట్టారని ఎద్దేవా చేస్తున్నారు.

44కే పరిమితం

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ కేవలం 44 సీట్లు మాత్రమే గెలుచుకుంది. సోనియా, రాహుల్‌లు పోను 42 స్థానాలు మాత్రమే గెలుచుకొని కాంగ్రెసు పార్టీ చరిత్రలో అతి ఘోర పరాజయం మూటగట్టుకుంది. అప్పటి నుండే రాహుల్ గాంధీ ఇబ్బందులు, పార్టీలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

లేని ప్రతిపక్ష హోదా

Parliament act: Did Rahul Gandhi mean to say that he isn't sleeping any more?

కాంగ్రెసు పార్టీ కేవలం 44 లోకసభ స్థానాలే గెలుచుకుంది. దీంతో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేకుండా పోయింది. విపక్షాల్లో తమకే ఎక్కువ సీట్లు ఉన్నందున తమకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కాంగ్రెసు పార్టీ పట్టుబడుతోంది. దీనిపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. రాహుల్ నేతృత్వంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్న అపప్రద వచ్చింది.

నాడు నిద్ర.. నేడు పోడియంలోకి.. వేకప్ గేమ్!

ఇటీవల సమావేశాల్లో రాహుల్ గాంధీ లోకసభలో కునుకు తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన హఠాత్తుగా సమస్యల పైన స్పందిస్తున్నట్లుగా వేకప్ గేమ్ ఆడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కూడా మతఘర్షణలు జరిగాయని, అప్పుడు రాహుల్ గాంధీ ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. తమ హయాంలోని తప్పుల పైన స్పందించని రాహుల్, నిన్న కునుకు తీసిన రాహుల్, ఇప్పుడు తన ప్రతిష్ట మసకబారే పరిస్థితి వచ్చే వరకు వేకప్ గేమ్ ఆడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

మీడియా దృష్టి ఆకర్షించేందుకు..

రాహుల్ గాంధీ మీడియా దృష్టిని ఆకర్షించేందుకే ఇలా చేస్తున్నారనే వారు కూడా ఉన్నారు. గతంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కేబినెట్ నిర్ణయాన్ని మీడియా ముందే తప్పు పట్టారని గుర్తు చేస్తున్నారు. నాడు ఎన్నికల కోసమే రాహుల్ మీడియాను ఆకర్షించేందుకు అలా చేశారని, ఇప్పుడు వరుస వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఇలా చేస్తున్నారని అంటున్నారు.

కాగా, ఎన్నికల్లో 44 సీట్లు రావడం, కాంగ్రెసు పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కక పోవడం, రాహుల్ గాంధీ పైన పార్టీ నాయకులే విమర్శలు గుప్పించడం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పగించవచ్చుననే వాదనలు వినిపించడంతో పాటు, పలుచోట్ల బ్యానర్లు కూడా వెలిశాయి.

English summary
The ruckus created by the Congress under the leadership of party Vice-President Rahul Gandhi in the Lower House of the Parliament demanding rising cases of communal riots in Uttar Pradesh and the ongoing row over the UPSC examinations drove home the point that the grand-old party's ego has been hurt beyond repair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X