14 నుంచి పార్లమెంట్ వర్షాకాల భేటీ - నోటిఫికేషన్ జారీ - ప్రశ్నోత్తరాలు లేవు - అక్టోబర్ 1తో పూర్తి
కరోనా మహమ్మారి విలయం.. ఆర్థిక వ్యవస్థ పతనం.. చైనాతో విభేదాలు.. లాంటి కీలక సమస్యలకుతోడు.. సోషల్ మీడియా దిగ్గజాలతో అధికార బీజేపీ కుమ్మక్కు.. కొవిడ్ కట్టడి చర్యల్లో కేంద్రం వైఫల్యం.. తదితర రాజకీయ అంశాలపై చర్చించేందుకు భారత పార్లమెంట్ సిద్ధమైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేరుతో లోక్ సభ సెక్రటేరియట్ సోమవారం అధిరారిక నోటిఫికేషన్ జారీ చేసింది.
Recommended Video
సెప్టెంబర్ 14న ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 1తో ముగియనున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి సమావేశాలను వినూత్నంగా నిర్వహించనున్నారు. గతంలో లోక్ సభ, రాజ్య సభలు ఒకేసారి ఉదయం 11కు ప్రారంభంకాగా, ఈసారి మాత్రం మొదటి పూటలో లోక్ సభను 4 గంటలు, రెండో పూటలో రాజ్యసభను 4 గంటలు మాత్రమే నిర్వహిస్తారు.

పార్లమెంట్ ఆవరణలోకి వచ్చే ఎంపీలు, ఉద్యోగులంతా 72 గంటల ముందే టెస్టులు చేయించుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఇదివేరకే ఆదేశాలు జారీ చేశారు. సోషల్ డిస్టెన్స్ నియమాల ప్రకారం కొత్తగా చేసిన సీటింగ్ ఏర్పాట్లను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పర్యవేక్షించారు. సమయాభావం నేపథ్యంలో ఈసారి ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసే అవకాశముంది. నేరుగా జీరో అవర్ చర్చతోనే ఉభయ సభలు ఆరంభంకానున్నాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజు సభ ఎజెండాలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అంశం చేర్చినట్లు సమాచారం. జనతాదళ్ (యు) ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ తిరిగి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక కానున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజునే డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications