పార్లమెంటు: ప్రధాని మాట్లాడాలంటూ విపక్షాల ఆందోళనలు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గురువారం ఉదయం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచే విపక్షాలు పెద్ద నోట్ల రద్దు అంశంపై ఆందోళన చేపట్టాయి. ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దుపై స్పందించాలని పట్టుబట్టాయి. అటు లోకసభలోనూ, ఇటు రాజ్యసభలోనూ విపక్షాలు నినాదాలతో గందరగోళం సృష్టించాయి.

Parliament: PM Narendra Modi attends RS proceedings

విపక్షాల ఆందోళనలతో రెండు సభలూ పలుమార్లు వాయిదా పడ్డాయి. ప్రధాని బయట మాట్లాడుతున్నారు, కానీ సభలో మాట్లాడటం లేదని కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ అజాద్ అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని సభలో మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభకు హాజరయ్యారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోకసభ శుక్రవారానికి వాయిదా పడింది.

నగ్రొటా దాడి మృతులకు లోక్‌సభ నివాళి

జమ్మూకాశ్మీర్‌లోని నగ్రొటా సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు లోక్‌సభ నివాళులు అర్పించింది. మంగళవారం జరిగిన ఈ దాడిలో ఏడుగురు సైనికులు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం పార్లమెంటు ఉభయసభలు అట్టుడికాయి. ఈ దాడిపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు తీవ్ర ఆందోళన చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Opposition has decided to raise the issue of hacking of verified twitter accounts of Rahul Gandhi and Congress, in both the Houses of Parliament today.
Please Wait while comments are loading...