వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Parliament RoundUp Today : సీబీఐ డైరెక్టర్ పదవీకాలం పెంపు బిల్లుకు ఆమోదం, రాజ్యసభలో అవే నిరసనలు

|
Google Oneindia TeluguNews

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఇవాళ కూడా నిరసనల మధ్యే కొనసాగాయి. లోక్ సభతో పాటు రాజ్యసభలోనూ ఉదయం ప్రశ్నోత్తరాల సమయం మొదలుకాగా.. కీలకమైన సీబీఐ డైరెక్టర్ పదవీకాలాన్ని ఐదేళ్లకు పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలిపాయి. అటు రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా విపక్షం నిరసనలు కొనసాగాయి.

లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానాద్ రాయ్.. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యుఎపిఎ చట్టాన్ని సవరించాలని యోచిస్తోందా అనే ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతానికి ఎటువంటి సవరణలు పరిశీలనలో లేవని, ఇటీవలి సాక్ష్యాధారాల నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. కొన్ని వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల నుండి అప్పుడప్పుడు నిరసనలు, హింసాత్మక సంఘటనలు నమోదవుతున్నట్లు తెలిపారు. సరిహద్దుల సరిహద్దులు మరియు భూభాగాలపై దావాలు, కౌంటర్-క్లెయిమ్‌ల నుండి సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నాయని వెల్లడించారు. ఏపీ-తెలంగాణ, బీహార్-జార్ఖండ్ మధ్య ఆస్తుల విభజనకు సంబంధించిన కొన్ని అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని మరో సమాధానంలో కేంద్రం పేర్కొంది.

Parliament RoundUp Today : extention of cbi director tenure bill passed, oppn protests in RS

రాజ్యసభలో 12 మంది ఎంపీల సస్పెన్షన్‌ను ఉపసంహరించాలన్న డిమాండ్‌ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించడంతో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. తమ సస్పెన్షన్‌ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే అనుమతించకపోవడంతో వాకౌట్‌ చేశారు. వెంటనే, సస్పెన్షన్‌ను రద్దు చేయాలంటూ వారు నినాదాలు చేశారు.
ఇంతలో, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, "తమ సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవడం కోసం ప్రభుత్వం వారితో వ్యక్తిగత స్థాయిలో చర్చలు జరుపుతోంది. అయితే వారు కనీసం విచారం వ్యక్తం చేయాలని స్పష్టం చేశారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్షాలను కేంద్రం గొంతు నొక్కుతోందని ఆరోపిస్తూ ఇవాళ ఉభయసభల్లోని విపక్ష ఎంపీలు ఢిల్లీలో మార్చ్ నిర్వహించారు. రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షను నిరసిస్తూ పార్లమెంట్ లోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి ఢిల్లీ విజయ్ చౌక్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఉభయసభలకు చెందిన పలువురు విపక్ష ఎంపీలు పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.

ఈరోజు రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ప్రశ్నపై స్పందించిన కేంద్రం.. 2019-20లో ఊహించిన దానికంటే ఎక్కువ రెవెన్యూ లోటు 'అమ్మ ఒడి', 'వైఎస్‌ఆర్ తొమ్మిది గంటల ఉచిత (విద్యుత్) సరఫరా వంటి పథకాల కారణంగా ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. పోలవరంతో సహా విభజన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేసారు. పదేళ్ళ కాల పరిమితితో ఇచ్చిన విభజన హామీలకు ఇప్పటికే 8 ఏళ్ళు గడిచిపోయిందని, మిగిలింది ఇక రెండేళ్ళేనని వైయస్ఆర్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పీవీ మిథున్ రెడ్డిగుర్తు చేశారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ పై కనికరం చూపండి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని లోక్ సభలో .కోరారు.

అటు తెలంగాణలో నాలుగు బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన ప్రశ్నకు స్పందించిన కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి... కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసమే ఈ సమ్మె చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ప్రయోజనాల కోసమే ఈ వ్యవహారాన్ని రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే గనుల వేలం ప్రక్రియ ప్రారంభమైందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి ... ఇది విధాన నిర్ణయమని పేర్కొన్నారు.

ఇవాళ పార్లమెంట్ హైలెట్స్

- పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం

- ఉభయసభల్లో ప్రశ్నోత్తరాల సమయం

- లోక్ సభలో సీబీఐ డైరెక్టర్ పదవీకాలం పెంపు బిల్లుపై చర్చ, ఆమోదం

- రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా విపక్షాల నిరసనలు, వాకౌట్

- రాజ్యసభో ఎంపీల సస్పెన్షన్ ఉపసంహరించుకోకపోవడంతో బయట విపక్షాల ర్యాలీ

- మహాత్మాగాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకూ రాహుల్ సహా విపక్ష ఎంపీల ర్యాలీ

English summary
in today's parliament winter session, both the house passed bill for extention of cbi director tenure upto 5 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X