Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోక్ సభ ప్రశ్నోత్తరాలు-ధాన్యం కొనుగోలుకు టీఆర్ఎస్-మెడికల్ కాలేజీలకు వైసీపీ ఎంపీల వినతి

పార్లమెంటు శీతాకాల సమావేశాల ఐదోరోజు కొనసాగుతోంది. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీఎర్ఎస్, వైసీపీ ఎంపీలు తమ రాష్ట్రాలకు సంబంధించిన పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై కేంద్రం సమాధానం ఇవాల్సి ఉంది. ముందుగా టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు అంశంపై మాట్లాడారు.

తెలంగాణలో ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇవ్వడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రైతులు భారీ ఎత్తున వరిసాగు చేస్తున్నారని, కానీ కేంద్రం వారు పండించిన వరిని కొనుగోలు చేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని నామా ఆరోపించారు. దేశానికి రైతు వెన్నెముక అని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాబట్టి తెలంగాణ రైతుల నుుంచి యాసంగి వరిని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని నామా కోరారు.

parliament winter session : trs demand for paddy procurement, ysrcp for medical colleges in LS

అనంతరం మాట్లాడిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రాష్ట్రంలో భారీ ఎత్తున చేపడుతున్న మెడికల్ కాలేజీల గురించి ప్రస్తావించారు. ప్రభుత్వం 16 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చిందని, ఇందులో మూడింటికి నిధులు కూడా ఇస్తోందని తెలిపారు. నాడు- నేడు కింద రాష్ట్ర ప్రభుత్వం పలు మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తోందన్నారు. ఈ దశలో కేంద్రం కూడా మిగిలిన 13 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆర్ధిక సాయం చేసి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో వైద్య వసతులు మెరుగుపర్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కూడా సహకరించాలని ఎంపీ సత్యనారాయణ కోరారు.

parliament winter session : trs demand for paddy procurement, ysrcp for medical colleges in LS

మరోవైపు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీకరణకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రైవేటీకరణ కారణంగా దేశానికి గర్వకారణమైన పలు ప్రభుత్వ రంగ సంస్ధలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. కేంద్రం తక్షణం వీటి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నుస్రత్ జహాన్ కోరారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రైవేటీకరణ చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్ధల జాబితాను సైతం ఆమె లోక్ సభలో చదివి వినిపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+