వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

27 కీలక బిల్లులు.. వాడీ వేడీ చర్చ: మరికాసేపట్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయోధ్య భూవివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన తర్వాత జరగనున్న తొలి పార్లమెంట్ సమావేశాలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సారి సభలో అధికార విపక్ష పార్టీల మధ్య వాడీవేడీ చర్చ జరిగే అవకాశముంది.

త్వరలో కొత్త పార్లమెంటు భవనం..గుజరాత్ సంస్థకు పనులు అప్పగించిన కేంద్రంత్వరలో కొత్త పార్లమెంటు భవనం..గుజరాత్ సంస్థకు పనులు అప్పగించిన కేంద్రం

 సభలో 27 బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

సభలో 27 బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కేంద్రం 27 బిల్లులను సభలో ప్రవేశ పెట్టనుంది. రాఫెల్ జమ్మూకశ్మీర్ అంశాలను అస్త్రాలుగా చేసుకుని విపక్షాలను అధికార బీజేపీ ఇరుకున పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక అధికార పక్షం, విపక్షాల మధ్య జమ్ము కశ్మీర్ అంశం, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, సిటిజెన్‌షిప్ బిల్లులు అంశాలపై వాడీవేడీ చర్చ జరిగే అవకాశం ఉంది. నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13 వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి.

 అఖిలపక్షంతో ఆదివారం భేటీ అయిన ప్రధాని మోడీ

అఖిలపక్షంతో ఆదివారం భేటీ అయిన ప్రధాని మోడీ

ఇక పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధాని మోడీ ఢిల్లీలో అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాలపై ఆయన ఆయా పార్టీ నేతలతో మాట్లాడారు. రాజ్యసభ 250వ సెషన్స్‌ను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమావేశంలో ప్రధాని మోడీ చెప్పారు. గత సమావేశాలు సజావుగా జరిగేందుకు కృషి చేసిన లోక్‌సభ రాజ్యసభ ప్రిసైడింగ్ ఆఫీసర్లను కొనియాడారు.

పెండింగ్‌ బిల్లులను కూడా టేకప్ చేస్తాం: ప్రహ్లాద్ జోషి

పెండింగ్‌ బిల్లులను కూడా టేకప్ చేస్తాం: ప్రహ్లాద్ జోషి

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 27 కీలక బిల్లులను ప్రవేశపెట్టి చర్చచేపడతామని పార్లమెంటు వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఆర్డినెన్స్ రూపంలో ఉన్న ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధం, టాక్సేషన్ ఆఫ్ లా బిల్లులను ఈ శీతాకాల సమావేశాల్లో పాస్ చేయిస్తామని ధీమా వ్యక్తం చేశారు ప్రహ్లాద్ జోషి. ఇదిలా ఉంటే పెండింగ్‌లో ఉన్న బిల్లులను టేకప్ చేసి పాస్ చేయించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రహ్లాద్ జోషి తెలిపారు.

అస్త్రాలతో సిద్ధమైన ప్రతిపక్షాలు

అస్త్రాలతో సిద్ధమైన ప్రతిపక్షాలు


ఇదిలా ఉంటే బీజేపీని ప్రతిపక్షాలు టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెలకొన్న హైడ్రామా పై ప్రతిపక్షాలు బీజేపీని కార్నర్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక శివసేన బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంతో కమలం పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో శివసేన ఎంపీలు ప్రతిపక్షాలు కూర్చుండే చోట కూర్చోనున్నారు. జమ్మూ కశ్మీర్ అంశం నుంచి ఆర్థిక మాంద్యం వరకు తొలిరోజున అధికార విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగే అవకాశం ఉంది.

 పాస్ చేయించాలని భావిస్తున్న ముఖ్యమైన బిల్లులు ఇలా ఉన్నాయి.

పాస్ చేయించాలని భావిస్తున్న ముఖ్యమైన బిల్లులు ఇలా ఉన్నాయి.

*నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ డిజైన్ (అమెండ్‌మెంట్ )బిల్లు, 2019

* చిట్‌ఫండ్ (అమెండ్‌మెంట్)బిల్లు 2019

*సరోగసీ రెగ్యులేషన్ బిల్లు 2019

* అంతరాష్ట్ర నదీ జలాలా వివాదం (అమెండ్‌మెంట్)బిల్లు 2019

* డ్యామ్ సేఫ్టీ బిల్లు

*ట్రాన్స్‌జెండర్ పర్సన్ (హక్కుల పరిరక్షణ)బిల్లు, 2019

* జలియన్‌వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ (అమెండ్‌మెంట్)బిల్లు 2019

*కాన్స్‌టిట్యూషన్ (షెడ్యూల్ తెగల)ఆర్డర్ (అమెండ్‌మెంట్)బిల్లు 2019

* కాన్స్‌టిట్యూషన్ (షెడ్యూల్ తెగల)ఆర్డర్ (రెండవ అమెండ్‌మెంట్)బిల్లు 2019

 ప్రాధాన్యత కలిగిన కొత్త బిల్లుల ప్రవేశపెట్టడం పాస్ చేయించడం:

ప్రాధాన్యత కలిగిన కొత్త బిల్లుల ప్రవేశపెట్టడం పాస్ చేయించడం:


* పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్ బిల్లు 2019

* ఇన్‌సాల్వెన్సీ & బ్యాంక్‌రప్టసీ (రెండవ) అమెండ్‌మెంట్ బిల్లు 2019

* ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ బిల్లు, 2019

* మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (అమెండ్‌మెంట్)బిల్లు 2019

* సిటిజెన్ షిప్ (అమెండ్‌మెంట్)బిల్లు 2019

* పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2019

* ఆర్మ్స్ యాక్డ్ (అమెండ్‌మెంట్)బిల్లు 2019

English summary
The Winter Session of Parliament, which is all set to start on Monday, is likely to witness heated discussions as the Opposition looks to raise issues of economic slowdown, job crisis and the lockdown in Jammu and Kashmir as the Modi dispensation seeks to push through the contentious Citizenship (Amendment) Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X