డోక్లాం పర్యటనకు రాహుల్, ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి సిద్దమైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో స్టాండింగ్ కమిటి సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో వచ్చే నెలలో పర్యటించనుంది.
31 మంది సభ్యుల గల కమిటి ఈ పర్యటనకు వెళ్లనుందని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొంటారు. వివాదస్పద డోక్లాం ప్రాంతంలో కూడా పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. డోక్లాం వివాదంతో భారత్-చైనా మధ్య గత కొంతకాలం యుద్ద వాతావరణం నెలకొంటుంది.

డోక్లాం ప్రాంతంలో భారత్- చైనా సైనిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వివాదానికి కారణం ఏమిటనే విషయమై ఈ కమిటి పరిశీలించనుందని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు.
ఏరియల్ వ్యూ కోసం ప్రత్యేక చాపర్‌ను ఉపయోగించనున్నారు. డోక్లాం ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రోడ్డుకు భారత్ అభ్యంతరం తెలుపుతుంది. డోక్లాం వద్ద చైనా-భూటాన్ మధ్యకూడా సరిహద్దు వివాదం ఉంది.
డోక్లాం విషయంలో భూటాన్ మొదటి నుంచి భారత్‌కు అనుకూలంగానే ఉంది. గతంలో డోక్లాం వివాదంపై భారత విదేశాంగ అధికారులను రాహుల్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. డోక్లాం వద్ద చైనా సృష్టిస్తున్న వివాదంపై చైనా అధికారులతో రాహుల్ గతంలో చర్చించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications