West Bengal Forecast: బెంగాల్ తీర్పు క్లియర్..! సెఫాలజిస్ట్ పార్ధాదాస్ అంచనా..!

పశ్చిమ బెంగాల్లో (West Bengal) జరిగిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందనే దానిపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, విశ్లేషకులు, సాధారణ ప్రజలు సైతం ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బెంగాల్లో వరుసగా నాలుగోసారి మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ గెలవకుండా ఏం చేయాలో అన్నీ చేసిన బీజేపీని ఓటర్లు కరుణించారా, ఎస్ఐఆర్ ప్రభావమెంత, ముస్లిం ఓటర్లు ఎటు మొగ్గారు .. ఇలా చాలా అంశాలు బెంగాల్ ఎన్నికల గతిని మార్చేశాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్ని క్షేత్రస్దాయిలో గమనిస్తూ ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్న ప్రముఖ సెఫాలజిస్ట్ పార్ధాదాస్ (Partha Das) తొలి దశ పోలింగ్ తర్వాత కుండబద్దలు కొట్టేశారు.

బెంగాల్ లో 152 సీట్లకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో టీఎంకీకి 80-86 సీట్లు వస్తాయని, బీజేపీకి 66 నుంచి 72 సీట్లు వస్తాయని పార్ధా దాస్ అంచనా వేశారు. తొలి దశలో ముస్లిం ఓటర్లు 27-29% ఉన్నారని, ముస్లిమేతర ఓటర్లు 72-74% ఉన్నారని తెలిపారు.
ఓటర్ల జాబితాలో 100 మంది ముస్లిం ఓటర్లు ఉంటే, 95-97% మంది ఓటు వేయడానికి వచ్చారన్నారు. (అస్సాంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలు కూడా ఇదే విధంగా ఓటు వేశారు. తృణమూల్ కు దాదాపు 80-85% ముస్లిం ఓట్లు వచ్చాయన్నారు. (ఇది 2021 అసెంబ్లీ మరియు 2024 పార్లమెంట్ ఎన్నికల కంటే చాలా ఎక్కువ).

Partha Das s Phase 1 west Bengal Forecast TMC Leads BJP Struggles Without Positive Vote
తమిళనాడు, బెంగాల్, కేరళలో గెలిచేది వీళ్లే-ఫరూక్ అబ్దుల్లా జోస్యం..!
తమిళనాడు, బెంగాల్, కేరళలో గెలిచేది వీళ్లే-ఫరూక్ అబ్దుల్లా జోస్యం..!

ఎస్ఐఆర్ (SIR) వల్ల ప్రజలు వేధింపులకు గురవుతున్నట్లు భావిస్తున్నారని, ఈసారి ఓటు వేయకపోతే తమ ఉనికికే ముప్పు వాటిల్లుతుందని ప్రజలు భావించారని పార్ధా దాస్ తెలిపారు. వారి పేరును ఓటర్ల జాబితా నుండి తొలగిస్తారని, వారి బ్యాంకు ఖాతాను స్తంభింపజేస్తారని, ఇంకా ఇలాంటివి జరుగుతాయని వారు భయపడ్డారన్నారు. వారు తమ సొంత డబ్బు ఖర్చుపెట్టి ఓటు వేయడానికి వచ్చారన్నారరు. ఈ ముస్లిమేతర వలస కార్మికులు సరిగ్గా ఎలా ఓటు వేశారనేది ఒక ప్రశ్నార్థకం అన్నారు.

Partha Das s Phase 1 west Bengal Forecast TMC Leads BJP Struggles Without Positive Vote
PM Modi: బెంగాల్ మాదే..! మమతకు మోడీ మే4 వార్నింగ్..!
PM Modi: బెంగాల్ మాదే..! మమతకు మోడీ మే4 వార్నింగ్..!

టీఎంసీ ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోందని, కానీ బీజేపీకి అనుకూల ఓట్లు లేవన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో బాలాకోట్ ప్రభావం స్పష్టంగా కనిపించిందని, మోదీకి అనుకూల ఓటు పడిందని. కానీ ఇప్పుడు మోదీపై భావోద్వేగం కూడా తగ్గిపోతోందన్నారు. బీజేపీ పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుపైనే ఆధారపడి ఉందన్నారు. మరే ఇతర అంశం సాయం చేయడం లేదన్నారు. టీఎంసీ 2021 ఫిబ్రవరిలో లక్ష్మీ భండార్‌ను ప్రవేశపెట్టిందని, ఇది 2019 లోక్‌సభ ఎన్నికలలో లేని విధంగా టీఎంసీకి వ్యతిరేకతను సృష్టిస్తోందన్నారు. బంగ్లాదేశ్, అస్సాం, జార్ఖండ్, ఒడిశా, బీహార్ లో రాజకీయ, సామాజిక సామాజిక పరిస్థితులు బీజేపీకి సాయం చేయడం లేదన్నారు. బీజేపీకి క్షేత్రస్థాయి సంస్థాగత బలం కొరవడిందని, 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే మతపరమైన పోలరైజేషన్ తక్కువగా ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+