కేజ్రీ దూరం: బిజెపిలోకి ఆప్ నేత కుమార్ విశ్వాస్?
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. కాగా, బిజెపిలో చేరేందుకు విశ్వాస్ 46వ పుట్టిన రోజు వేడుకనే ముందస్తు వేదిక అయినట్లు తెలుస్తోంది.
బుధవారం కుమార్‌విశ్వాస్ పుట్టిన రోజు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ఆప్ నేతలతో పాటు బిజెపి నేతలు కూడా హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్‌సింగ్, విజయ్ గోయల్, ఓం మాథూర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

కాగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఈ వేడుకలో పాల్గొనలేదు. కాగా.. ఈ ఏడాది కనీసం ట్విట్టర్‌లో కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. అయితే ఆప్ నుంచి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మరికొందరు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, నిరుడు కుమార్‌విశ్వాస్ పుట్టిన రోజు కేజ్రీవాల్, సిసోడియాలు దర్గర ఉండి మరీ జరిపించారు.
దీంతో కుమార్ విశ్వాస్ నిజంగానే బిజెపిలో చేరబోతున్నారని.. అందుకే కేజ్రీవాల్ ఆయనకు దూరంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. తనకు అన్ని పార్టీల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వచ్చాయని, అయితే తాను ఏదో ఒక పార్టీలో మాత్రమే చేరతానని కుమార్ విశ్వాస్ ట్వీట్ చేయడం గమనార్హం. మరి కుమార్ విశ్వాస్ బిజెపిలో చేరుతున్నారో లేదో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications