పిల్లలకు, సీనియర్ సిటిజన్లకు పాస్ పోర్ట్ ఫీజులో 10% తగ్గింపు
పాస్ పోర్ట్ చట్టం ఉత్సవాల సందర్భంగా చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లకు పాస్ పోర్ట్ పీజులో 10 శాతం రాయితీని ప్రకటించింది కేంద్రం.
న్యూఢిల్లీ: పాస్ పోర్ట్ చట్టం ఉత్సవాల సందర్భంగా చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లకు పాస్ పోర్ట్ పీజులో 10 శాతం రాయితీని ప్రకటించింది కేంద్రం.
1967 పాస్ పోర్ట్ చట్టం ఏర్పాటుచేసుకొని 50 ఏళ్ళు పూర్తైన సందర్భంగా నిర్వహించిన పాస్ పోర్ట్ సేవా దివస్ లో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు.

ఇప్పటివరకు పాస్ పోర్ట్ కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఉంది.అయితే ఇక నుండి ఇంగ్లీష్ తో పాటు హిందీ భాషలో కూడ పాస్ పోర్ట్ ను జారీ చేయనున్నట్టు ప్రకటించారు.
రెండు రోజుల పాటు పాస్ పోర్ట్ రుసుములో తగ్గింపును ప్రకటించారు. ముఖ్యంగా ఎనిమిది సంవత్సరాలలోపు వారికి, 60 ఏళ్ళ పైబడిన ధరఖాస్తుదారులకు ఫీజులో 10 శాతం తగ్గింపును ప్రకటించారు.












Click it and Unblock the Notifications