పఠాన్‌కోట్ దాడి: పాక్‌కు ఎల్ఆర్ పంపనున్న భారత్
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి వెనుకున్న కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని పాకిస్థాన్‌ను భారత్ కోరింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వానికి లెటర్ రొగేటరీ(ఎల్ఆర్) పంపనుంది.
సైనిక ఆపరేషన్‌లో హతమైన ఉగ్రవాదుల డిఎన్ఏ నమూనాలు, ఫోన్ కాల్స్ తదితర వివరాలను పాకిస్థాన్‌కు భారత్ అందజేయనుంది. పఠాన్‌కోట్‌లో సైనిక బలగాల చేతిలో హతమైన ఆరుగురు ఉగ్రవాద మృతదేహాలకు వీలైనంత త్వరగా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది.

అంతేగాక, పాకిస్థాన్‌లోని సూత్రధారుల నుంచి ఉగ్రవాదులకు వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలు ఎల్ఆర్ ద్వారా పొరుగు దేశానికి పంపించనుంది. ఈ వివరాలతో కుట్రదారులను పట్టుకోవాలని పాక్ ప్రభుత్వ వర్గాలకు భారత్ అధికారికంగా విజ్ఞప్తి చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇది ఇలా ఉండగా, పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిని అమెరికా ఖండించింది. పాకిస్థాన్ ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరించాలని, వారిని అంతం చేయాలని పిలుపునిచ్చింది. కాగా, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్.. భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి పఠాన్‌కోట్ ఘటనపై మాట్లాడారు. ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరిస్తామని హామి ఇచ్చినట్లు తెలిసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications