షాకింగ్: మెదడులో క్రికెట్ బాల్ పరిమాణంలో బ్లాక్ ఫంగస్ తొలగింపు: 3 గంటలకుపైగా ఆపరేషన్

పాట్నా: బీహార్ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఈ ఫంగస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, బ్లాక్ ఫంగస్ బారినపడిన ఓ 60ఏళ్ల వ్యక్తిని పాట్నాలోని ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఐజీఐఎంఎస్) వైద్యులు కీలక శస్త్రచికిత్స చేసి కాపాడారు.

Recommended Video

    Ap Capital Moving to vizag on July 23 | Fans Remembering Sushant as he left this world on this day.
    క్రికెట్ బాల్ పరిమాణంలో బ్లాక్ ఫంగస్..

    క్రికెట్ బాల్ పరిమాణంలో బ్లాక్ ఫంగస్..

    ఆపరేషన్ అనంతరం ఐజీఐఎంఎస్ వైద్యులు డాక్టర్ బ్రజేష్ మాట్లాడుతూ.. బాధితుడి మెదడు నుంచి క్రికెట్ బాల్ అంత పరిమాణంలోని బ్లాక్ ఫంగస్‌ను తొలగించామని వెల్లడించారు. ఈ సర్జరీ డాక్టర్ బ్రజేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. సుమారు మూడు గంటలకుపైగా శ్రమించి క్లిష్టతరమైన ఈ శస్త్ర చికిత్స చేశారు. ఆపరేషన్ అనంతరం జముయికి చెందిన బాధితుడు అనిల్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

    ముక్కు నుంచి మెదడులోకి బ్లాక్ ఫంగస్..

    ముక్కు నుంచి మెదడులోకి బ్లాక్ ఫంగస్..

    ఐజీఐఎంఎస్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మనీష్ మండల్ మీడియాతో మాట్లాడుతూ.. బాధితుడు ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నాడని, అయితే, ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని తెలిపారు. ఆ తర్వాత అతను ఐజీఐఎంఎస్‌లో చేరారు. పరీక్షలు నిర్వహించగా.. అతనికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు తేలింది. ముక్కు నుంచి అనిల్ కుమార్ బ్రెయిన్‌లోకి బ్లాక్ ఫంగస్ చేరినట్లు గుర్తించిన వైద్యులు వెంటనే ఆపరేషన్‌‌కు ఏర్పాట్లు చేశారు. కళ్లకు వ్యాప్తిచెందకుండా శుక్రవారం మూడుగంటలకుపైగా అతనికి శస్త్రచికిత్స చేశారు. బ్రెయిన్‌కు బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందడం ఇప్పటి వరకు తాము చూడలేదని వైద్యులు తెలిపారు. సరైన సమయంలో శస్త్రచికిత్స చేసి బ్లాక్ ఫంగస్‌ను తొలగించడంతో అనిల్ కుమార్ కళ్లకు ఎలాంటి హాని జరగలేదని డాక్టర్ మండల్ తెలిపారు.

    అవయవాలను కోల్పోతున్న బ్లాక్ ఫంగస్ బాధితులు..

    అవయవాలను కోల్పోతున్న బ్లాక్ ఫంగస్ బాధితులు..

    కాగా, బ్లాక్ ఫంగస్ బారినపడిన బాధితులు చాలా మంది తమ అవయావాలను కోల్పోయిన విషయం తెలిసిందే. బ్లాక్ ఫంగస్ బారినపడిన చాలా మందికి కళ్లు, ముఖ భాగంలోని కొంతభాగాన్ని తీసివేయాల్సి వచ్చిందని వైద్యులు వెల్లడించారు. మహారాష్ట్రలోని విదర్భకు చెందిన ఓ బాధితుడు తన రెండు కళ్లను కోల్పోయాడు. కాగా, కరోనా నుంచి కోలుకున్న డయాబెటీస్ బాధితులకు ఎక్కువగా బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదముందని చెబుతున్నారు. అంతేగాక, కరోనా సమయంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల కూడా బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటికే బీహార్ తోపాటు పలు రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్‌ను అంటు వ్యాధుల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+