చెల్లిస్తారా? జైలు కెళ్తారా?: సుబ్రతా రాయ్‌కి సుప్రీం అల్టిమేటం
సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 15 నాటికి రూ.2,550 కోట్లు మదుపుదార్లకు చెల్లించకపోతే మళ్లీ జైలుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది.
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 15 నాటికి రూ.2,550 కోట్లు మదుపుదార్లకు చెల్లించకపోతే మళ్లీ జైలుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఏప్రిల్ 17న విచారించిన న్యాయస్థానం ఆంబే వ్యాలీలోని రూ.34 వేల కోట్ల విలువైన ఆస్తులను విక్రయించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా రూ.5092.6 కోట్లు జమచేయకపోవడంపై గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది.

రాయ్‌కు పెరోల్ సహా బెయిల్ కోసం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులన్నీ గురువారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాలని, లేదంటే తీహార్ జైలుకు వెళ్లక తప్పదని సుప్రీం హెచ్చరించింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రూ. 11,169కోట్లను సహారా గ్రూప్.. సెబీకి చెల్లించాల్సి వుంది.












Click it and Unblock the Notifications