అంత ఖరీదైనా ఇల్లా?: ప్రాపర్టీ కొనుగోలుకు పేటీఎం బాస్ బిగ్ డీల్!
లుటియెన్స్ జోన్ లో అడుగుపెట్టిన తొలి ఇంటర్నెట్ బిలియనీర్ గా విజయ్ శేఖర్ శర్మ క్రెడిట్ కొట్టేయనున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
బెంగుళూరు: నోట్ల రద్దు అనంతరం నగదు రహిత బదిలీలకు ప్రాధాన్యత పెరిగిన సంగతి తెలిసిందే. నగదు రహిత బదిలీల కోసం చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నా.. ఎక్కువ మంది పేటీఎం ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పేటీఎం ఒక్కసారిగా అధిక లాభాలను ఆర్జించింది.
ఈ లాభాల పంటతో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఆదాయం కూడా అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడాయన దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఓ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలుకు సిద్దమయ్యారు. న్యూఢిల్లీ గల్ఫ్ లింక్స్ లో త్వరలో ఆయన ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీని విలువు దాదాపు రూ.82కోట్లుగా ఉండవచ్చునని చెబుతున్నారు.
లుటియెన్స్ జోన్‌లో ఆయన 6000చదరపు అడుగుల ప్రాపర్టీకి ఎంఓయూ కుదుర్చకున్నారన్నట్లు తెలుస్తోంది. దీనికి కొంతమొత్తం చెల్లింపులు కూడా జరిగినట్లు సమాచారం. అయితే ఈ లావాదేవీలు రిజిస్టర్ కాలేదని చెబుతు్నారు. కాగా, ఫ్లిప్ కార్ట్ తర్వాత విజయ్ శేఖర్ శర్మ ఆన్ లైన్ మార్కెట్లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.

ఫోర్బ్స్ జాబితాలో అతి చిన్న భారత బిలియనీర్ గాను శర్మ చోటు దక్కించుకున్నారు. గతేడాది 162శాతం ఆయన సంపద పెరగా.. నికర సంపద 1.3బిలియన్ డాలర్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకులు బిన్నీ, సచిన్ బన్సాల్ లు కూడా మల్టీ మిలియన్ డాలర్ రెసిడెన్షియల్ ఇన్వెస్టుమెంట్స్ చేపట్టినట్లు సమాచారం.
కాగా, లుటియెన్స్ జోన్ లో అడుగుపెట్టిన తొలి ఇంటర్నెట్ బిలియనీర్ గా విజయ్ శేఖర్ శర్మ క్రెడిట్ కొట్టేయనున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 1000బంగ్లాలతో 3000ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాంతంలో కేవలం 70ఎకరాలను మాత్రమే ప్రైవేటు అవసరాల కోసం ఉపయోగిస్తారు.












Click it and Unblock the Notifications