Paytm IPO:ప్రైస్ బ్యాండ్, మార్కెట్ ప్రీమియం షేర్ ధర ఎలా ఉన్నాయి..ఇన్వెస్ట్ చేయొచ్చా..?

ఇండియన్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను జారీ చేసింది. ఈ ఐపీఓను పేటీఎం మాతృసంస్థ One97 communications జారీ చేసింది. సోమవారం నుంచి ఈ ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం మూడు రోజుల పాటు ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ కోసం తెరిచి ఉంటుంది. నవంబర్ 10న దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీగా ప్రకటించింది. ఇక ఈ ఐపీఓ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

పేటీఎం ఐపీఓ వివరాలు

పేటీఎం ఐపీఓ వివరాలు

నవంబర్ 8వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు పేటీఎం ఐపీఓ దరఖాస్తుదారులకు తెరిచి ఉంటుంది. ఇక పేటీఎం షేర్ విలువ వివరాలకు వస్తే ఒక్కో షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.2080 - 2150 మధ్య ఫిక్స్ చేశారు. షేర్లను విక్రయానికి ముందు పేటీఎం దాదాపుగా రూ.8235 కోట్లు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది. ఇక రూ.8300 కోట్లు విలువ చేసే తాజా ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించాలని వాటాదారులు భావించారు. వారికి రూ.10వేల కోట్లు మేరా పేటీఎంలో వాటాలున్నాయి. భారత్‌లోని కార్పొరేట్ చరిత్రలోనే పేటీఎం ఐపీఓ అతిపెద్ద ఐపీఓ అని విశ్లేషకులు చెబుతున్నారు. పదేళ్ల కిందట ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ రూ. 15000 కోట్లు మేరా ఐపీఓ ద్వారా సమీకరించింది.

విశ్లేషకులు ఏం చెబుతున్నారు

విశ్లేషకులు ఏం చెబుతున్నారు

ఇక మార్కెట్ పరిశీలకుల పరిశీలన మేరకు గ్రే మార్కెట్‌లో పేటీఎం షేర్ల ప్రీమియం పడిపోయింది. గ్రేమార్కెట్ ధర ఈ రోజుకు రూ.62గా ఉందని చెబుతున్నారు. 18 నవంబర్ 2021వ తేదీన బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (BSE)మరియు నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (NSE)లో లిస్ట్ అవుతుంది. డిజిటల్ పేమెంట్ విప్లపం వచ్చిన తర్వాత పేటీఎం అత్యంత ప్రజాదరణ పొందిన పేమెంట్ యాప్‌గా నిలిచింది. 2021-2026 ఆర్థిక సంవత్సరా మధ్య ఇతర మొబైల్ పేమెంట్ యాప్స్‌తో పోలిస్తే పేటీఎం ఐదు రెట్లు పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే దీని షేర్ ధర అంత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు.

నిధులతో పేటీఎం ప్లాన్ ఏంటి..?

నిధులతో పేటీఎం ప్లాన్ ఏంటి..?

ఇక తాజా ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తంతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు పేటీఎం యాజమాన్యం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అదు సమయంలో కొత్త మర్చెంట్లు కస్టమర్లను కూడా పెంచుకునేలా ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే కంపెనీ నష్టాల్లో ఉన్న సమయంలో తన బ్రాండింగ్ ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మరింత నష్టాల్లోకి వెళ్లకుండా నివారించుకోగలిగింది. ఇక కొత్త మర్చంట్లు, కొత్త కస్టమర్లు ఏ మేరకు వస్తారనేదానిపై కంపెనీ పెరుగుదల ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న విశ్లేషకులు పేటీఎం ఐపీఓకు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఇది దీర్ఘకాలం కోసం సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మరింత బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కంపెనీలో ఇన్వెస్టర్లు ఎవరు..?

కంపెనీలో ఇన్వెస్టర్లు ఎవరు..?

ఇప్పటికే రూ.10వేల కోట్లు మేరా వాటాలున్న వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.8,300 కోట్లు తాజా ఈక్విటీ షేర్లను ఐపీఓ ద్వారా విక్రయిస్తున్నారు. పేటీఎం ఎండీ మరియు సీఈఓ విజయ్ శేఖర్ శర్మతో పాటు జపాన్ సాఫ్ట్ బ్యాంక్, చైనాకు చెందిన యాంట్ గ్రూప్, అలీబాబా, ఎలివేషన్ క్యాపిటల్ లాంటి సంస్థలు పేటీఎంలో ఇన్వెస్టర్లుగా ఉన్నారు. వారు తమ వాటాలను ఐపీఓ ద్వారా విక్రయిస్తున్నారు.ఇప్పటికే పేటీఎంలో 122 ఇన్స్‌టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఆసక్తి కనబర్చినట్లు నవంబర్ 3న విడుదలైన డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది. వీరంతా ఒక్కో షేర్‌ను రూ.2,150తో కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+