కశ్మీర్ అధికార పార్టీకి షాక్ : రాజీనామా చేసిన ఎంపీ తారిక్
శ్రీనగర్ : చెప్పినంత పని చేసేశారు కశ్మీర్ అధికార పార్టీ ఎంపీ తారిక్ కర్ర.ఇంతకుముందుప్రకటించినట్లుగానే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు తారిక్. శ్రీనగర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తారిక్.. కాశ్మీర్ లోయలో శాంతి భద్రతలను కాపాడడంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ రాజీనామా చేశారాయన.

గత కొద్దిరోజులుగా ఆయన రాజీనామా వార్తలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వినిపిస్తూ వచ్చాయి. ఇకపోతే కశ్మీర్ లోయలో చెలరేగిన అల్లర్ల విషయంలో తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు తారిక్. కాగా, బుర్హానీ వని ఎన్ కౌంటర్ తర్వాత కశ్మీర్ లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. కేంద్రం నుంచి అఖిలపక్ష బృందం కూడా జమ్ముకాశ్మీర్‌లో పర్యటించినా శాంతి భద్రతల పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఏదేమైనా ఎంపీ తారిక్ రాజీనామా అధికార పార్టీ రాజకీయాలను కుదిపేసిగానే తయారైంది.












Click it and Unblock the Notifications