మైయాస్ గ్రూప్స్ మీద రూ. 140 కోట్లు చీటింగ్ కేసు, మారిషస్ కంపెనీ ఫిర్యాదు, నకిలి సంతకంతో మోసం!

బెంగళూరు: ప్రముఖ మైయాస్ బేవరేజ్ అండ్ ఫుడ్ ప్రై. లిమిటెడ్ కంపెనీ మీద చీటింగ్ కేసు నమోదు అయ్యింది. బెంగళూరులోని జయనగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పీపల్ క్యాపిటల్ కంపెనీ ఫిర్యాదు చెయ్యడంతో మైయాస్ కుటుంబ సభ్యుల మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మారిషస్ కు చెందిన పీపల్ క్యాపిటల్ ఇన్వేస్ట్ మెంట్ సంస్థ ఫిర్యాదు మేరకు మైయాస్ సంస్థలో 57 శాతం వాటాలు తీసుకుందని, రూ. 140 కోట్లు పెట్టుబడులు పెట్టారని సమాచారం. తాము పెట్టిన రూ. 140 కోట్ల పెట్టుబడులను వేరే ప్రయోజనాల కోసం మైయాస్ సంస్థ ఉపయోగించుకుందని పీపల్ కంపెనీ ఆరోపించింది.

Peepul Capital Investments has alleged that they had pumped in Rs 140 Crore for 57% stake in the Maiyas group.

నకిలి సంతకం చేశారని, చీటింగ్ చేశారని, క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోవాలని పీపల్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైయాస్ చేసిన చీటింగ్ పనికి తమ సంస్థకు చాలా నష్టం జరిగిందని పీపల్ క్యాపిటల్ సంస్థ ఆరోపిస్తుంది.

కేసు నమోదు చేసిన జయనగర్ పోలీసులు మైయాస్ సంస్థ చీఫ్ పి. సదానంద మయ్య, ఆయన కుమారుడు సుదర్శన్ మయ్య, భార్య సునంద మయ్య, సంస్థ అధికారులు గోపాలక్రిష్ణ, గణపతి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నారని డీసీపీ అన్నామలై మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+