Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెగాసస్ నిఘా కుట్ర: మోదీ సర్కారును నిలదీయనున్న పార్లమెంటరీ కమిటీ -ఈనెల 28న భేటీకి పిలుపు

దేశ భద్రతను ప్రమాదంలోకి నెడుతూ, విదేశీ సాఫ్ట్ వేర్ ద్వారా వందల మంది ప్రముఖులపై కేంద్రంలోని మోదీ సర్కారు నిఘాపెట్టిన ఉదంతం సంచలనం రేపుతున్నది. ఇజ్రాయలీ నిఘా సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ రూపొందించిన పెగాసస్ సాఫ్ట్‌వేర్.. దేశంలోని పలువురు ప్రముఖులపై నిఘా పెట్టేందుకు వినియోగించారన్న అనుమానాలు ప్రస్తుతం పార్లమెంటును కుదిపేస్తున్నాయి. ఈ ఉదంతంలో ప్రభుత్వం నుంచి సమాధానాలను రాబట్టేందుకు పార్లమెంటరీ కమిటీ కీలక అడుగులు వేస్తున్నది..

దేశంలో పెగాసస్ నిఘా ఉదంతంపై ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విచారణ చేపట్టనుంది. కాంగ్రెస్ నేత, లోక్‌సభ ఎంపీ శశీథరూర్ నేతృత్వంలోని ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈనెల 28న సమావేశానికి పిలుపునిచ్చింది. కేంద్ర ఐటీ, హోం శాఖల్లోని కీలక అధికారులను సైతం కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి.

Pegasus row: Shashi Tharoor-led Parliamentary panel to question Centre on July 28

పెగాసస్ స్పైవేర్ నిఘా నీడలో వివిధ పార్టీల నేతలు, జర్నలిస్టులు ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ.. ఐటీ, హోం శాఖలను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ''పౌరుల సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యత అంశాలపై చర్చిస్తాం'' అంటూ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. సమాచార, ఐటీ, హోం మంత్రిత్వ శాఖల ప్రతినిధులు కూడా కమిటీ ముందు హాజరవ్వాల్సి ఉంటుందని కమిటీ తెలిపింది.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఇద్దరు కేంద్ర మంత్రులు, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, 40 మంది ప్రముఖ జర్నలిస్టులపై పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో నిఘా పెట్టి ఉండొచ్చంటూ ది వైర్, వాషింగ్టన్ పోస్ట్ వంటి 14 వార్తా సంస్థలు ఇటీవల సంచలన కథనాలు ప్రచురించాయి. ప్రముఖల ఫోన్ నెంబర్లు ఉన్న జాబితాను ప్రకటించాయి. అయితే..

ఈ జాబితాతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్ఎస్ఓ గ్రూప్ ఇటీవల స్పష్టం చేసింది. ఈ స్పైవేర్ గుట్టుచప్పుడు కాకుండా మొబైల్ ఫోన్లలోకి ప్రవేశించగలదని, ఫోన్ హ్యాకైనట్టు గుర్తించడం చాలా కష్టమని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఫోన్లలో ఉన్న కీలక సమాచారాన్ని చాలా పకడ్బందీ వ్యూహంతో తస్కరిస్తుందని వారు తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా పెగాసస్ ఉదంతం వెలుగులోకి రావడంతో విపక్షాలు సర్కారుపై మూకదాడికి దిగాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+