పాపం చేస్తే క్యాన్సర్ వస్తుంది, ఇది దేవుడి శిక్ష, అసోం మంత్రి, కాంగ్రెస్ ఫైర్, బీజేపీ అసలు రంగు !

పాపాలు చేసిన వారిని దేవుడు క్యాన్సర్ వ్యాదితో శిక్షిస్తాడుచిన్న వయసులోనే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తారు, బీజేపీ మీద కాంగ్రెస్ ఫైర్హిందూ, క్రైస్తవ ధర్మం ఆధారంగా అలా చెప్పాను, ఆరోగ్య శాఖా మంత్రి వివాదా

గువాహటి: పాపం చేసిన వారికి దేవుడు ఇచ్చే శిక్ష ఏమిటో తెలుసా ? అది క్యాన్సర్ వ్యాది, లేదంటే చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం చెందుతారు, లేదంటే అంతకంటే భయంకరమైన వ్యాదులు వస్తాయని బీజేపీ సీనియర్ నాయకుడు, అసోం ఆరోగ్య శాఖా మంత్రి హిమంత బిస్వా శర్మ వివావాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అసోంలో టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ హాజరైనారు. అనంతరం సభలో మాట్లాడుతూ ప్రజలకు నీతులు చెప్పడం మొదలు పెట్టారు. పాపాలు చేసిన వారిని దేవుడు సామాన్యంగా క్షమించరని మంత్రి అన్నారు.

పాపాలు చేసిన వారికి చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదాలు జరిగి మరణిస్తారని, లేదంటే క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాదులతో బాధపడి మరణిస్తారని మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసోం ఆరోగ్య శాఖా మంత్రి హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మండి పడుతున్నారు.

People have cancer because of their sins, this is divine justice: Assam minister Himanta Biswa Sarma

అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి. చిందరం స్పంధిస్తూ బీజేపీ నాయకుల మనస్థత్వం, వారి మనోభావాలు ఇలాగే ఉంటాయని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు దేబబ్రాత్ సైకై స్పంధిస్తూ ఆరోగ్య శాఖా మంత్రి హిమంత బిస్వా శర్మ మాటలు విన్న క్యాన్సర్ వ్యాది బాధితులు ఎంతో బాధపడుతారో అంటూ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే రణదీప్ ఎస్. సూరజ్ వాలా సైతం మంత్రి హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

ఈ విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరోగ్య శాఖా మంత్రి హిమంత బిస్వా శర్మ స్పంధిస్తూ హిందూ, క్రైస్తవుల నమ్మకాల ప్రకారం నేను అలా మాట్లాడానని, కాంగ్రెస్ నాయకులు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని సమర్థించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో అసోం మంత్రి హిమంత బిస్వా శర్మను కడిగిపారేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+