విద్యార్థుల ముసుగులో జిహాదీలు, మావోయిస్టులు: అల్లర్ల వెనుక అరాచక శక్తులు: నిర్మలా సీతారామన్..!
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశ రాజధానిలో కొద్దిరోజులుగా చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితుల వెనుక జిహాదీలు, మావోయిస్టులు, వేర్పాటువాదుల హస్తం ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. విద్యార్థుల ముసుగులో అసాంఘిక శక్తులు, అరాచకవాదులు హింసను ప్రేరేపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు, కార్యక్రమాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

విధ్వంసం వెనుక..
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశ రాజధానిలోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులు కొద్దిరోజులుగా ఆందోళన ప్రదర్శనలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఆదివారం ఈ ప్రదర్శనలు కాస్తా అదుపు తప్పాయి. హింసాత్మకంగా మారిపోయాయి. బస్సులను దగ్ధం చేసే స్థాయికి చేరుకుంది. పలువురు ఆందోళనకారులు బస్సులను తగుల బెట్టారు. వాటి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ చర్యలకు తాము కారణం కాదని జామియా మిల్లియా విద్యార్థులు సైతం ప్రకటించుకున్నారు.

స్పందించిన నిర్మలా సీతారామన్..
అదే సమయంలో ఢిల్లీ పోలీసులు కొందరు జామియా యూనివర్శిటీ క్యాంపస్ ఆవరణలోకి ప్రవేశించి- విద్యార్థులపై లాఠీ చార్జీ చేశారు. వారిని అక్రమంగా నిర్బంధించారు. పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ లాఠీ ఛార్జీలో 200 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనల తరువాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ వరుస ఘటనపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నోరు విప్పారు. విద్యార్థుల లాఠీ ఛార్జీపై ఓ కేంద్రమంత్రి స్పందించడం ఇదే తొలిసారి.

ఆందోళన గురించి.. ఏమీ తెలియదు..
జామియా విద్యార్థుల నిర్బంధం గురించి తనకేమీ తెలియదని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆదివారం రాత్రి ఏం జరిగిందనేది తన దృష్టికి రాలేదని అన్నారు. సోమవారం ఆమె ఢిల్లీలో తనను కలిసిన విలేెకరులతో మాట్లాడారు. విద్యార్థుల ముసుగులో వేర్పాటువాదులు ప్రవేశించారని ఆరోపించారు. జిహాదీలు, మావోయిస్టులు.. ఈ సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.

త్వరలోనే అన్నీ సర్దుకుంటాయ్..
విద్యార్థులెవరూ ఇంత భారీ ఎత్తున హింసాత్మక చర్యలకు దిగకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. కొంతమంది అరాచక వాదులు విద్యార్థుల పేరుతో హింసాత్మక చర్యలకు దిగుతున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తరువాతే దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఏర్పడినట్టు కనిపిస్తోందని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని నిర్మలా సీతారామన్ అన్నారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications