యాపిల్ అంటే అంత మోజా?: ఫస్ట్ రిటైల్ స్టోర్ ముందు పడిగాపులు
ముంబై: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న యాపిల్ స్మార్ట్‌ఫోన్.. దేశీయ మార్కెట్‌లో అడుగు పెట్టబోతోంది. ఇంకాస్సేపట్లో రిటైల్ అమ్మకాలు ఆరంభం కాబోతోన్నాయి. దీనికోసం యాపిల్ కంపెనీ యాజమాన్యం- భారత్‌లో రిటైల్ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ స్టోర్‌ను ప్రారంభించడానికి యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ స్వయంగా భారత్‌కు వచ్చారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ స్టోర్ ఏర్పాటైంది. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో దీన్ని నెలకొల్పింది యాపిల్ మేనేజ్‌మెంట్. ఈ ఉదయం 11 గంటలకు టిమ్ కుక్.. దీన్ని ప్రారంభించనున్నారు. యాపిల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడానికి బయ్యర్స్ బారులు తీరారు. స్టోర్ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ.. తెల్లవారు జాము నుంచే దీని ముందు పడిగాపులు పడుతున్నారు. పెద్ద సంఖ్యలో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌కు చేరుకున్నారు.

25 సంవత్సరాలుగా భారత్‌లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది యాపిల్ మేనేజ్‌మెంట్. ఇప్పటివరకు ఆ కంపెనీ ఇక్కడ తన రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడా కొరతను తీర్చుకుంది. రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. భారత్‌లో తొలిదశలో రెండు రిటైల్ స్టోర్లను నెలకొల్పుతున్నట్లు ఇదివరకే ప్రకటించిందా సంస్థ. అందులో భాగంగా తొలి స్టోర్ ఇవ్వాళ కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది.
రెండో స్టోర్ దేశ రాజధానిలో ఏర్పాటు చేసింది. దానితో పోల్చుకుంటే- ముంబై రిటైల్ స్టోర్ రెండింతలు పెద్దది. దేశ ఆర్థిక రాజధాని కావడం వల్ల ఇక్కడ పెద్ద ఎత్తున యాపిల్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు నమోదవుతాయని అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా కొనుగోలుదారుల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ లభిస్తోంది. తెల్లవారు జాము నుంచే స్టోర్ వద్ద బారులు తీరి నిల్చున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ పెద్ద సంఖ్యలో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌కు చేరుకుంటోన్నారు.
తన భారత పర్యటన సందర్భంగా టిమ్ కుక్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకుంటారని తెలుస్తోంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను ఆయన పరిశీలిస్తోన్న నేపథ్యంలో- దీనికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చిస్తారని చెబుతున్నారు. యాపిల్ స్మార్ట్ ఫోన్ల వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోవడంతో పాటు.. రిటైల్ స్టోర్ల సంఖ్యను మున్ముందు భారీగా పెంచబోతోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications