వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పర్సనల్ ఫైనాన్స్: ఫిక్సిడ్ డిపాజిట్ల వల్ల ఎలా నష్టపోతాం, ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు ఏమిటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పెట్టుబడి

డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం చాలామందికి అలవాటు. దీనికి ముఖ్య కారణం బ్యాంకులపై ఉండే నమ్మకం. నిర్దేశిత వ్యవధి తరువాత వడ్డీ సహా బ్యాంక్ నుంచి మనకు రావలసిన మొత్తాన్ని ఈ విధానంలో తీసుకోవచ్చు.

కానీ యుద్ధం లేదా ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బ్యాంకుల దగ్గర ఉండే డిపాజిట్లను ప్రభుత్వం వాడుకోవచ్చు. 1971 యుద్ధంలో, కార్గిల్ యుద్ధంలో అలాంటి అవసరం మన ప్రభుత్వానికి రాలేదు. భారత ప్రభుత్వానికి అలాంటి అవసరం వచ్చే అవకాశాలు దాదాపు శూన్యం. అందుకే ఈ నియమాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు.

అంటే ఫిక్సిడ్ డిపాజిట్ చేసిన సొమ్ముకు మార్కెట్ రిస్క్ శూన్యం. కానీ ఫిక్సిడ్ డిపాజిట్ నుంచీ వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఇస్తున్న వడ్డీ ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువ.

పర్సనల్ ఫైనాన్స్

అంటే ఫిక్సిడ్ డిపాజిట్ వల్ల మన మదుపు నికర విలువ ఏటికేడు తగ్గుతుందని అర్థం. మరోవైపు స్టాక్ మార్కెట్ అంటే ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. కొందరు మదుపరులు ఈ భయం వల్లే ఫిక్సిడ్ డిపాజిట్ ద్వారా మదుపు చేసి నష్టపోతుంటారు. దీనికి అవగాహన లేమి కూడా ఒక కారణం.

ఇంకొందరు మదుపరులు ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాలకు (ఉదా: పిల్లల చదువు) ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఒక పెద్దమొత్తం తమకు అందుతుందన్న భరోసాతో ఉంటారు. కానీ ఇది కూడా అవగాహన లేకపోవడం వల్ల చేసే తప్పిదం. ఎందుకంటే సరైన ప్లాన్ ప్రకారం మదుపు చేస్తే.. మార్కెట్ ద్వారా వచ్చే మొత్తానికి, ఫిక్సిడ్ డిపాజిట్ ద్వారా వచ్చే మొత్తానికి చాలా తేడా ఉంటుంది.

మదుపు అంటేనే దీర్ఘకాలం చేయాల్సినది అని పర్సనల్ ఫైనాన్స్ నిపుణుల చెబుతుంటారు. అలా ఎక్కువ కాలం మదుపు చేయడం వల్ల మార్కెట్ రిస్క్ తగ్గుతుంది. అలాగే మార్కెట్లో తక్కువ రిస్క్ ఉన్న మదుపు మార్గాలు ఫిక్సిడ్ డిపాజిట్ కంటే ఎక్కువ ఆదాయాన్ని ఇస్తాయి. కానీ ఫిక్సిడ్ డిపాజిట్ లాంటి వీటికి గ్యారంటీ ఉండదు. ఇప్పుడు ఇలా తక్కువ రిస్క్ ఉన్న మదుపు మార్గాలను ఒకసారి చూద్దాం.

1. ఇండెక్స్ ఫండ్స్:

మ్యూచువల్ ఫండ్స్‌లాగే ఈ ఫండ్స్ ద్వారా మదుపు చేసిన మొత్తాన్ని వివిధ కంపెనీల షేర్లలో పెడతారు. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లాగా ఒక ఫండ్ మేనేజర్ ఉండరు. ఎందుకంటే ఈ ఫండ్స్ ఏదో ఒక సూచికను అనుసరిస్తాయి. అందుకే ఈ ఫండ్స్ ద్వారా చేసే మదుపును ఆటోమేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు.

సాధారణ మ్యూచువల్ ఫండ్స్ ఒక ఫండ్ మేనేజర్ ఆధ్వర్యంలో మార్కెట్ కంటే మంచి పనితీరు చూపించాలని పని చేస్తుంటాయి. కానీ ఇండెక్స్ ఫండ్స్ మాత్రం సదరు సూచికి తగినట్టు పనితీరు ఉంటే చాలని పని చేస్తాయి.

సెన్సెక్స్-30.. ఉదాహరణకు ఈ ఫండ్ ఎలా పని చేస్తుందో చూద్దాం. క్రింద ఇచ్చిన పట్టికలో సెన్సెక్స్-30 సూచీలో ఉన్న వివిధ కంపెనీలు, వాటి వెయిటేజీ ఉంది. రిలయన్స్ సంస్థకు 13.36%, హెచ్‌డీఎఫ్‌సీ సంస్థకు 9.65% వెయిటేజి ఇచ్చారు. ఇప్పుడు మీరు సెన్సెక్స్-30 సూచీని అనుసరించే ఇండెక్స్ ఫండ్ ద్వారా మదుపు చేస్తే అందులో 13.65% రిలయన్స్‌లో, 9.65% హెచ్‌డీఎఫ్‌సీలో, మిగిలిన డబ్బులు వెయిటేజీ ఆధారంగా ఇతర సంస్థలలో మదుపు చేస్తారు.

ఒకవేళ ఏదైనా సంస్థ సెన్సెక్స్-30 సూచీలో స్థానం కోల్పోతే వెంటనే ఆ సంస్థలో అప్పటిదాకా మదుపు చేసిన మొత్తాన్ని కొత్తగా జత చేసిన సంస్థలోకి మారుస్తారు. సెన్సెక్స్-30 అనే సూచీ చాలా కీలకమైనది. అందుకే లాభదాయకంగా ఉండే సంస్థలే అందులో భాగంగా ఉంటాయి. గత దశాబ్ద కాలంలో సెన్సెక్స్-30 సూచీ 250% దాకా పెరిగింది. అంటే ఈ ఇండెక్స్ ఫండ్ ద్వారా మదుపు చేసిన వారి మదుపు మొత్తం కూడా అంతే పెరిగి ఉంటుంది.

పర్సనల్ ఫైనాన్స్

ఇలాంటి ఇండెక్స్ ఫండ్స్ వివిధ సూచీలకు ఉన్నాయి. ప్రతీ రంగానికి చెందిన ఇండెక్స్ ఫండ్స్ అంటే.. బ్యాంక్, ఐటీ, బంగారం, రియల్ ఎస్టేట్ సూచీలకు సంబంధించిన ఫండ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

పర్సనల్ ఫైనాన్స్

2. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్:

ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ పనితీరు కూడా ఇండెక్స్ ఫండ్స్ పనితీరు లాగే ఉంటుంది. రెండిటిలో వివిధ సంస్థలలో, వివిధ రంగాలలో మదుపు చేసే అవకాశం ఉంది.

ఈ రెండు ఫండ్స్ మధ్య ముఖ్యమైన తేడాలు:

  • ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ పనితీరు నిర్దేశించిన సూచికి అతి దగ్గరగా ఉంటుంది. ఈ విషయంలో ఇండెక్స్ ఫండ్ కంటే ఇదే మేలు.
  • ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా SIP సౌలభ్యం లేదు. ఇండెక్స్ ఫండ్ ద్వారా SIP సౌలభ్యం ఉంది.
  • ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా యూనిట్లు మాత్రమే కొనగలం. కానీ ఇండెక్స్ ఫండ్స్ ద్వారా ఎంత మొత్తానికైనా ఫండ్స్ కొనగలం. అంటే ఈటీఎఫ్.. ద్వారా కొన్ని యూనిట్లకు ఎంత మొత్తం అవసరం అవుతుందో అంత మొత్తం చెల్లించాలి. కానీ ఇండెక్స్ ఫండ్ ద్వారా ఎంత మొత్తానికైనా సరిపోయే యూనిట్లు కొనగలం. దాదాపు అన్ని ఇండెక్స్ ఫండ్స్ మదుపు 500 రూపాయల నుంచీ మొదలు పెట్టగలం. కానీ ఈటీఎఫ్ ద్వారా చేసే మదుపు కనీస ధర సూచీ మీద ఆధారపడి ఉంటుంది.
  • ఇండెక్స్ ఫండ్స్ రోజులో ఎప్పుడైనా అమ్మవచ్చు. కానీ ఈటీఎఫ్.. ట్రేడింగ్ ముగింపులో ఉన్న ధరకు మాత్రమే అమ్మగలం లేదా కొనగలం.

3. డెట్ మ్యూచువల్ ఫండ్స్:

డెట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేసిన మొత్తాన్ని ఫండ్ మేనేజర్ కొన్ని బాండ్లను కొని వాటి మీద వచ్చే వడ్డీని తిరిగి మనకు ఆదాయంగా ఇస్తారు. స్థూలంగా ఇది ఒక రుణదాతకు-రుణగ్రహీతకు మధ్య జరిగే లావాదేవీ లాంటిది. వివిధ రంగాలలో ఉండే బాండ్ల వడ్డీలలో తేడాలు ఎక్కువగా ఉండటం వల్ల ఫండ్ మేనేజర్ పాత్ర చాలా కీలకం అవుతుంది.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కంటే ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ రిస్క్ తీసుకోలేని వారికి ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే ఫిక్సిడ్ డిపాజిట్ కంటే ఖచ్చితంగా దీనిలో ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

4. గిల్ట్ మ్యూచువల్ ఫండ్స్:

డెట్ మ్యూచువల్ ఫండ్స్ కోవలోకే చెందిన మరో ముఖ్యమైన మదుపు మార్గం గిల్ట్ ఫండ్స్. ఈ ఫండ్స్ ప్రత్యేకత ఏమంటే కేవలం ప్రభుత్వ బాండ్లలో మాత్రమే మదుపు చేస్తారు. సహజంగా రాష్ట్రాలు లేదా కేంద్ర ప్రభుత్వ బాండ్ల మీద ఇవ్వాల్సిన వడ్డీని తప్పకుండా ఇస్తుంది. కాబట్టి మార్కెట్ రిస్క్ భయం చాలా తక్కువ.

సెబీ నియమాల ప్రకారం గిల్ట్ ఫండ్స్ పోర్ట్ ఫోలియోలో కనీసం 80% ప్రభుత్వ బాండ్లలో మదుపు చేసి ఉండాలి. వీటి ద్వారా కూడా ఫిక్సిడ్ డిపాజిట్ కంటే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Personal Finance: How we lose money on fixed deposits, what are the ways to get more income?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X