పెట్రోల్, డీజిల్ ధరలు..ఏ సిటీలో ఎలా ఉన్నాయంటే..?
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలతో సుమారు రెండు నెలల పాటు చమురు సంస్థలు వాహనదారులను బెంబేలెత్తించాయి. ఈ ఏడాది మే 4వ తేదీన మొదలైన ఇంధన ధరల పెరుగుదల సుమారు రెండు నెలల పాటు యథేచ్ఛగా కొనసాగింది. ఇదివరకు కాస్త అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. పెరుగుదల మొదలైన తరువాత వంద రూపాయల మార్క్‌ను దాటేశాయి.. మరింత పైపైకి దూసుకెళ్లాయి. చమురు కంపెనీల వరుస బాదుడుతో వాహనదారులకు చుక్కలు కనిపించాయి.
ఈ వరుస పెంపుదలకు పుల్‌స్టాప్ పెట్టాయి చమురు సంస్థలు. కొంతకాలంగా ఇంధన ధరల పెంపుదల జోలికి వెళ్లలేదు. పైగా కొంతమేర తగ్గించుకుంటూ వస్తోన్నాయి. సెప్టెంబర్ నెల ప్రారంభం రోజు.. వాటి రేట్లను మరోసారి స్వల్పంగా తగ్గించాయి. పెట్రోల్‌పై లీటర్ ఒక్కింటికి 10 నుంచి 15 పైసలు, డీజిల్‌పై లీటర్ ఒక్కింటికి 14 నుంచి 15 పైసల మేర తగ్గించాయి. 5వ తేదీన మరోసారి వాటి ధరలను తగ్గించాయి. అప్పటి నుంచి పెట్రోల్ ధరల్లో మార్పులు ఉండట్లేదు. వరుసగా ఆరో రోజు ఇంధన ధరల్లో స్థిరత్వం కనిపించింది.

శుక్రవారం నాటి రేట్లే ఇవ్వాళ కూడా కొనసాగుతోన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరల్లో చెప్పుకోదగ్గ మార్పులు లేవు. దాని ప్రభావంతో యధాతథ స్థితిని కొనసాగింపజేశాయి చమురు సంస్థలు. ఇదే స్థితి మున్ముందు కనిపిస్తుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఇంధన ధరలను తగ్గిస్తూ వస్తోన్నందున.. ఆయిల్ కంపెనీలు ఇదే ట్రెండ్‌ను కొనసాగించే అవకాశాలు లేకపోలేదు.
ఈ తెల్లవారు జామున 6 గంటలకు నమోదైన రేట్ల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి రూ.101.19 పైసలుగా ఉంది. డీజిల్ రూ.88.62 పైసలు పలుకుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రేటు 107.26 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.96.19 పైసలకు చేరింది. కోల్‌కతలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.101.62 పైసలకు చేరగా డీజిల్ రూ.91.71 పైసలు పలుకుతోంది. చెన్నైలో పెట్రోల్ రూ.99.96 పైసలు, డీజిల్ రూ.93.26 పైసలుగా రికార్డయింది. దేశంలో అనేక రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడులోనే ఇంధన ధరలు ఒకింత తక్కువగా ఉంటోన్నాయి. తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై మూడు రూపాయల పన్నును తగ్గించడమే దీనికి కారణం.
భోపాల్‌లో పెట్రోల్ రూ.109.63 పైసలకు చేరగా, డీజిల్ రూ.97.43 పైసలుగా నమోదైంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.105.26 పైసలు, డీజిల్ రూ.96.69 పైసలు, బెంగళూరులో పెట్రోల్ రూ.104.70 పైసలు, డీజిల్ ధర తగ్గి రూ.94.04 పైసలకు చేరింది. లక్నోలో పెట్రోల్ రూ.98.30 పైసలు, డీజిల్ రూ.89.02 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.104.70 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. ఇంధన రేట్లు కాస్త తగ్గుముఖం పట్టడం కొంత ఊరట కలిగించినట్టయింది. నామమాత్రపు తగ్గింపు కావడం వల్ల అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు 100 రూపాయలపైగానే ఉంటోంది.












Click it and Unblock the Notifications