వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ భగ్గు: రోజూ ఇదే తంతు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇవ్వాళ పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌పై 35 పైసలు పెరిగింది. లీటర్‌కు 35 పైసల మేర పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వరుసగా ఇది మూడోసారి. బుధవారం నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. ఇంధన ధరలను పెంచే విషయంలో చమురు సంస్థలు ఏ మాత్రం వెనుకాడట్లేదు. వాహనదారులపై అదనపు భారాన్ని మోపుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల రూపంలో వీపు విమానం మోత మోగుతోంది.

లీటర్‌పై 35 పైసలు.. మూడోస్సారి

లీటర్‌పై 35 పైసలు.. మూడోస్సారి

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్‌‌, డీజిల్‌పై 35 పైసల మేర పెంపుదల కనిపించింది. లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర పెంచడాన్ని బెంచ్‌మార్క్‌గా పెట్టుకున్నట్టు కనిపిస్తోన్నాయి చమురు కంపెనీలు. తాజాగా పెరిగిన ధరలతో దేశంలోని అనేక నగరాల్లో లీటర్ పెట్రోల్ 115 రూపాయలను దాటింది. డీజిల్ వంద రూపాయల మార్క్‌ను దాటేసింది. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.106.89 పైసలకు చేరింది. డీజిల్ 95.62 పైసలుగా నమోదైంది.

మూడు రూపాయలు తగ్గించినా.. ఫలితం లేనట్టే

మూడు రూపాయలు తగ్గించినా.. ఫలితం లేనట్టే

దేశ ఆర్థిక రాజధానిలో ముంబైలో పెట్రోల్ రూ.112.78 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్‌ రూ.103.63 పైసలకు చేరింది. కోల్‌కతలో పెట్రోల్ ధర రూ.107.45 పైసలుగా నమోదైంది. డీజిల్‌ ధర రూ.98.73 పైసలుగా రికార్డయింది. చెన్నైలో పెట్రోల్ రూ.103.92 పైసలు, డీజిల్‌ ధర రూ.99.92 పైసలుగా నమోదైంది. పెట్రోల్ అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం మూడు రూపాయల మేర పన్నును తగ్గించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయినట్టయింది.

హైదరాబాద్‌లో డీజిల్ భగ్గు..

హైదరాబాద్‌లో డీజిల్ భగ్గు..

కాగా- బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.110.61, డీజిల్ రూ.101.49 పైసలు, నోయిడాలో పెట్రోల్ రూ.104.08 పైసలు, డీజిల్ రూ.96.26 పైసలకు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.111.18 పైసలు, డీజిల్ రూ.104.32 పైసలకు చేరింది. విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.113.25 పైసలు, డీజిల్ ధ‌ర రూ.105.89 పైసలకు చేరింది. పాట్నాలో పెట్రోల్ రూ.110.44 పైసలు, డీజిల్ రూ.102.21 పైసలు, జైపూర్‌లో పెట్రోల్ రూ.114.11 పైసలు, డీజిల్ రూ.105.34 పైసలు, గుర్‌గావ్‌లో పెట్రోల్ రూ.104.49, డీజిల్- 96.37, చండీగఢ్‌లో పెట్రోల్ రూ.102.88, డీజిల్ రూ.95.33 పైసలుగా నమోదైంది.

బాదడమే తక్షణ కర్తవ్యం..

బాదడమే తక్షణ కర్తవ్యం..

రోజువారీ పెరుగుదలలో అడపాదడపా కొంత విరామం లభిస్తోందే తప్ప.. రేట్లు మాత్రం తగ్గట్లేదు. రెండు రోజులు బ్రేక్ ఇస్తే.. వారం రోజుల పాటు వాటి ధరలను పెంచే పరిస్థితి దేశంలో నెలకొంది. ఈ రోజుతో ఇంధన ధరలను పెంచడాన్ని చమురు సంస్థల ఆపివేస్తాయని ఏ రోజుకు ఆ రోజు అనుకోవడం ఓ అత్యాశగానే మిగిలిపోయింది. ప్రతిరోజు వాహనదారులను బాదడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు కనిపిస్తోన్నాయి చమురు సంస్థలు. ఇదివరకట్లా మళ్లీ వరుసగా వాటి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచబోవనే గ్యారంటీ ఉండట్లేదు.

 మూడు రోజుల్లో రూపాయికిపైగా..

మూడు రోజుల్లో రూపాయికిపైగా..


రేట్లు ఎక్కడికి వెళ్లి ఆగుతాయనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచడంతో రేట్లు మరింత వేగంగా పైపైకి దూసుకెళ్తున్నాయి. పెట్రోల్, డీజిల్ లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర చొప్పున పెంచుతూ వస్తోండటం వల్ల మూడు రోజుల్లోనే ఒక రూపాయిని దాటస్తున్నాయి వాటి ధరలు. ఇలా ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. రేట్లు తగ్గే అవకాశం ఏ మాత్రం కూడా కనిపించట్లేదు.

English summary
The price of petrol was raised by 35 paise in Delhi, reaching Rs 106.89, while the price of diesel has been hiked by 35 paise as well, reaching Rs 95.62 on October 22, 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X