ఇంధన రేట్లు మళ్లీ భగ్గు: రోజూ ఇదే తంతు: అక్కడ పెట్రోల్ రూ.120ని దాటేసిందిగా
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇవ్వాళ పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌పై 35 పైసలు పెరిగింది. వరుసగా పెట్రోల్, డీజిల్ పెరగడం ఇదే అయిదోసారి. ప్రతి రోజూ 35 పైసలు అంతకుమించిన భారాన్ని వాహనదారులపై మోపుతున్నాయి చమురు సంస్థలు. ఇంధన ధరలను పెంచే విషయంలో ఏ మాత్రం వెనుకాడట్లేదు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల రూపంలో వీపు విమానం మోత మోగుతోంది.

లీటర్‌పై 35 పైసలు.. మూడోస్సారి
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల మేర పెంపుదల కనిపించింది. లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర పెంచడాన్ని బెంచ్‌మార్క్‌గా పెట్టుకున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో దేశంలోని అనేక నగరాల్లో లీటర్ పెట్రోల్ 115 నుంచి 120 రూపాయలుగా నమోదైంది. డీజిల్ 105 నుంచి 110 రూపాయలకు చేరువైంది. కొన్ని చోట్ల పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 120 రూపాయల మార్క్‌ను కూడా దాటేసింది.

ఢిల్లీ, ముంబైల్లో..
దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.109.34 పైసలకు చేరింది. డీజిల్ రూ.98.07 పైసలు పలుకుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ 115 రూపాయలను దాటేసింది. లీటర్ రూ.115.15 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్ రూ.106.23 పైసలకు చేరింది. కోల్‌కతలో పెట్రోల్ ధర రూ.109.79 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.101.19 పైసలుగా రికార్డయింది. చెన్నైలో పెట్రోల్ రూ.106.04 పైసలు, డీజిల్ ధర రూ.102.25 పైసలుగా నమోదైంది.

అక్కడ 120 రూపాయలకు పైగా
కాగా- బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.113.15, డీజిల్ రూ.104.09 పైసలు, నోయిడాలో పెట్రోల్ రూ.106.46 పైసలు, డీజిల్ రూ.98.73 పైసలకు చేరింది. పాట్నాలో పెట్రోల్ రూ.113.10 పైసలు, డీజిల్ రూ.104.71 పైసలు, లక్నోలో పెట్రోల్ రూ.106.24 పైసలు, డీజిల్ రూ.98.54 పైసలు, చండీగఢ్‌లో పెట్రోల్ రూ.105.22, డీజిల్- 97.77, రాంచీలో పెట్రోల్ రూ.103.53, డీజిల్ రూ.103.46 పైసలుగా నమోదైంది. భోపాల్‌లో పెట్రోల్ రూ.118.07 పైసలు, డీజిల్ రూ.107.50 పైసలుగా నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో పెట్రోల్ రూ.120.41 పైసలుగా నమోదైంది. డీజిల్ రూ.109.67 పైసలకు చేరింది.

మూడు రోజుల్లో రూపాయికిపైగా..
రేట్లు ఎక్కడికి వెళ్లి ఆగుతాయనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచడంతో రేట్లు మరింత వేగంగా పైపైకి దూసుకెళ్తున్నాయి. పెట్రోల్, డీజిల్ లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర చొప్పున పెంచుతూ వస్తోండటం వల్ల మూడు రోజుల్లోనే ఒక రూపాయిని దాటస్తున్నాయి వాటి ధరలు. ఇలా ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. రేట్లు తగ్గే అవకాశం ఏ మాత్రం కూడా కనిపించట్లేదు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications