వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ లీటర్ పెట్రోల్ రూ.104: కొన్ని అద్భుతాలు అలా జరిగిపోతుంటాయంతే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల పెరుగుదల యథేచ్ఛగా కొనసాగుతోంది. వాటి రేట్ల పెరుగుదలకు బ్రేక పడట్లేదు. ఒకట్రెండు రోజుల గ్యాప్ ఇస్తూ.. వాహనదారులకు వాతలు పెడుతూ వచ్చాయి చమురు సంస్థలు. ఈ నెల 2వ తేదీన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయిన రెండో రోజు అంటే.. 4వ తేదీన ఆరంభమైన పెట్రోల్, డీజిల్ రేట్లు అడ్డు, అదుపు లేకుండా పెరిగాయి. మధ్య మధ్యలో కొంత విరామం ఇచ్చాయే తప్ప పెరుగుదల మాత్రం పక్కాగా కొనసాగింది. ఇప్పటిదాకా 13 సార్లు వాటి ధరలు ఆకాశానికెగబాకాయి.

లీటర్‌పై 17, డీజిల్‌పై 29 పైసల మేర

లీటర్‌పై 17, డీజిల్‌పై 29 పైసల మేర

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ శుక్రవారం చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 15 నుంచి 17 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 25 నుంచి 29 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్-రూ.93.21, డీజిల్ 84.07 పైసలుగా రికార్డయింది. ముంబైలో పెట్రోల్ రేటు 99.49 రూపాయలు ఉంటోంది. డీజిల్‌ ధర 91.30 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 94.86, డీజిల్‌ ధర రూ. 88.87, కోల్‌కతలో పెట్రోల్ రూ.93.27 పైసలు, డీజిల్‌ ధర రూ.86.91 పైసలు పలుకుతోంది.

జైపూర్‌లో వందకు చేరువగా..

జైపూర్‌లో వందకు చేరువగా..

బెంగళూరులో పెట్రోల్-96.31, డీజిల్-89.12, పుణేలో లీటర్ పెట్రోల్-98.77, డీజిల్-88.96, పాట్నాలో పెట్రోల్-95.46, డీజిల్ 89.38, చండీగఢ్‌లో పెట్రోల్-89.72, డీజిల్-83.78, లక్నోలో పెట్రోల్-90.89, డీజిల్-84.51గా నమోదైంది. భోపాల్‌లో పెట్రోల్-101.34, డీజిల్-92.56 మార్క్‌ను దాటుకుంది. వంద రూపాయల మార్క్ దాటడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌లో పెట్రోల్-96.88, డీజిల్-91.65, నొయిడాలో పెట్రోల్-90.93, డీజిల్-84.54, జైపూర్‌లో పెట్రోల్-99.68, డీజిల్-92.78గా నమోదైంది.

ఆ రెండు చోట్లా రూ.104కు పైగా

ఆ రెండు చోట్లా రూ.104కు పైగా

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్, మధ్యప్రదేశ్‌లోని నగరాబంధ్‌లల్లో పెట్రోల్ రేట్లు రికార్డు స్థాయికి చేరింది. శ్రీగంగానగర్‌లో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.104.18 పైసలకు చేరింది. నగరాబంధ్‌లో 104.41గా రికార్డయింది. ఈ రెండు చోట్ల డీజిల్ రేట్లు లీటర్ ఒక్కింటికి రూ.96.91 పైసలు, రూ.95.39 పైసలుగా నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని అనూప్‌పూర్‌లో పెట్రోల్ లీటర్ రూ.103.86 పైసలు, డీజిల్ 94.88 పైసలు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. దేశీయంగా వాటి రేట్లు అనూహ్యంగా పెరుగుతోండటం చర్చనీయాంశమైంది.

Recommended Video

Chattisgarh : గూబగుయ్ మనిపించి సారీ చెప్పిన Collector, అసలు ట్విస్ట్ ఇదే!! || Oneindia Telugu
శనివారం నాటికి రూ.5.76 పైసలు..

శనివారం నాటికి రూ.5.76 పైసలు..

ఇప్పటిదాకా డజనుసార్లు ఇంధన రేట్లు పెరిగాయి. ఒక నెలలో ఈ స్థాయిలో పెరగడం చరిత్రలో ఇదే తొలిసారి అనే అభిప్రాయాలు ఉన్నాయి. శనివారం నాటికి రూ.5.76 పైసల మేర ఫ్యూయల్ రేట్లు పెరిగాయి. తాజాగా ఇవ్వాళ పెరిగిన రేట్లు దీనికి అదనం. ఇందులో పెట్రోల్ వాటా రూ.2.69 పైసలు కగా.. డీజిల్‌ది రూ.3.07 పైసలు. ఈ స్థాయిలో వరుసగా పెరుగుదల ఏ నెలలో కూడా చోటు చేసకోలేదు. ఆ వరుస పెంపుల ఫలితంగా పెట్రోల్ ధర పీక్స్‌కు వెళ్లింది. స్కై హైలో దూసుకెళ్లింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో 100 రూపాయల మార్క్‌ను అధిగమించింది పెట్రోల్ రేటు.

English summary
Petrol price on Friday inched closer to the Rs 100-a-litre mark in Mumbai while diesel crossed the Rs 91 mark after oil companies raised rates again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X