వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజువారీ షాక్: పెట్రోల్‌పై రూ.6, డీజిల్‌పై రూ.3.67పైసలు

ఈ సంవత్సరం జులై ఒకటి నుంచి నేటివరకూ(ఆదివారం) పెట్రోల్‌ ధర ఆరు రూపాయలు పెరగడం గమనార్హం.

|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ: కొత్త విధానంలో అమలులోకి వచ్చిన నాటి నుంచీ పెట్రోల్‌ ధరలు పెరుగుతూనే ఉండటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీలు వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ సంవత్సరం జులై ఒకటి నుంచి నేటివరకూ(ఆదివారం) పెట్రోల్‌ ధర ఆరు రూపాయలు పెరగడం గమనార్హం.

రోజువారీ పెట్రోల్‌ ధరల నిర్ణయ పద్ధతిని అమలులోకి తీసుకొచ్చిన తర్వాత రూ.6 పెరగడం ద్వారా ధరలు మూడేళ్ల గరిష్ఠానికి చేరాయి. మరోపక్క డీజిల్‌ ధర కూడా పెరిగింది. లీటర్‌కు రూ.3.67 పెరిగి దేశ రాజధాని ఢిల్లీలో లీటరు రూ.57.03కు చేరింది. ఇది నాలుగు నెలల గరిష్ఠానికి చేరింది.

Petrol price up by Rs 6/litre since July; diesel Rs 3.67

ఆగస్టు 2014లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.69.04(ఢిల్లీ) ఉండగా, నేడు(ఆదివారం) రూ.70.33కు చేరింది. గత 15ఏళ్లుగా కొనసాగుతున్న పెట్రోల్‌ ధరలను ప్రతి నెలా 1, 16వ తేదీల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా మార్చేవారు.

ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ధరలు కొంతమేర తగ్గాయి. జూన్‌ 16న లీటర్‌ పెట్రోల్‌ ధర 65.48 ఉండగా, జులై 2 నాటికి రూ.63.06కు చేరింది. ఇక అక్కడి నుంచి ధరలు పెరుగుతూ వచ్చాయి. అదే సమయంలో జూన్‌ 16న డీజిల్‌ ధర రూ.54.49 ఉండగా, జులై 2 నాటికి రూ.53.36 చేరింది.

అయితే ఈ ఏడాది జూన్‌ నుంచి ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు ఏరోజు ధరను ఆరోజు నిర్ణయించి విక్రయించడం ప్రారంభించారు. ఈ పద్ధతి జూన్‌ 16 నుంచి కొనసాగుతోంది.

English summary
Petrol price has been hiked by Rs 6 per litre since the beginning of July and is now priced at its highest rate in three years with rates being revised in small dosages daily.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X