మళ్లీ బాదేశారు: టాప్ స్పీడ్‌లో పెట్రోల్, డీజిల్ రేట్స్: ఇప్పట్లో ఆగేదే లే
న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు మళ్లీ మళ్లీ భగ్గుమంటూనే ఉన్నాయి. చమురు సంస్థలు మరోసారి వాటి రేట్లను పెంచాయి. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వరుసగా ఇది ఏడో రోజు. వాహనదారులపై అదనపు భారాన్ని మోపుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల రూపంలో అదనపు భారం పడుతోంది. తాజా పెంపుతో దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 110 రూపాయల మార్క్‌ను దాటేసింది.

పెట్రోల్, డీజిల్‌పై ఎంత పెరిగిందంటే..
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల మేర పెంపుదల కనిపించింది. ఇదే పెరుగుదల అన్ని ఆయిల్ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. ఆదివారం కూడా ఇదే స్థాయిలో ఇంధన ధరలను పెంచాయి చమురు కంపెనీలు. ఈ పెంపుతో దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ ధర లీటర్ ఒక్కింటికి 110 రూపాయలను దాటింది. ఈ మార్క్‌ను అందుకున్న నగరాల సంఖ్య ఇదివరకు చాలా పరిమితంగా ఉండేది. ఇప్పడు పరిస్థితి మారింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలు, డీజిల్ 100 రూపాయలను దాటేసింది.

ముంబైలో డీజిల్ నూటొక్కటి
దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.104.44 పైసలకు చేరింది. డీజిల్ 93.18 పైసలుగా నమోదైంది. ముంబైలో పెట్రోల్ రూ.110.38 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్ ధర వంద రూపాయలను దాటింది. రూ.101.00 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ.101.76 పైసలు, డీజిల్ ధర రూ.97.56 పైసలుగా నమోదైంది. పెట్రోల్ అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం మూడు రూపాయల మేర పన్నును తగ్గించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయినట్టయింది. వరుసగా పెంచుతోన్న ధరల వల్ల ఇప్పుడు అక్కడ కూడా పెట్రోల్ ధర వంద రూపాయల మార్క్‌ను దాటింది.

హైదరాబాద్‌లో
కాగా- తాజా పెంపుతో కోల్‌కతలో పెట్రోల్ ధర రూ.105.05 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.96.24పైసలు. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.108.04, డీజిల్ రూ.98.85 పైసలు, లక్నోలో పెట్రోల్ రూ.101.43 పైసలు, డీజిల్ రూ.93.57 పైసలకు చేరింది. రాంచీలో పెట్రోల్ రూ.98.89 పైసలు, డీజిల్-98.30 పైసలు పలుకుతోంది. పాట్నాలో పెట్రోల్ రూ.107.60 పైసలు, డీజిల్ రూ.99.68 పైసలు, చండీగఢ్‌లో పెట్రోల్ రూ.100.49 పైసలు, డీజిల్ 92.86 పైసలుగా నమోదైంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.108.65 పైసలు, డీజిల్ రూ.101.52 పైసలు పలుకుతోంది. భోపాల్‌లో పెట్రోల్ రూ.112.96 పైసలు, డీజిల్ రూ.102.25 పైసలు పలుకుతోంది. నోయిడాలో పెట్రోల్ రూ.101.70, డీజిల్ రూ.93.80 పైసలకు చేరింది.
Recommended Video

ఈ నెలల్లో రూ.3.30
ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా పెట్రోల్‌లో రూ.2.80 పైసలు, డీజిల్ ధరల్లో రూ.3.30 పైసల పెరుగుదల చోటు చేసుకుంది. ఈ పెరుగుదల ఇక్కడితో ఆగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకమైంది. ఇక్కడితో ఆగలేనూ కనిపించట్లేదు. ఇదివరకట్లా మళ్లీ వరుసగా వాటి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచబోవనే గ్యారంటీ ఉండట్లేదు. ఈ నెల ఆరంభంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వల్ల- మున్ముందు మరిన్ని వాతలు ఉంటాయనే సంకేతాన్ని చమురు కంపెనీలు ఇవ్వకనే ఇచ్చినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల్లో చోటు చేసుకున్న పెరుగుదల వల్లే ఇంధన ధరలను సవరించాల్సి వచ్చిందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications