శుభవార్త: రూ.3.77 తగ్గిన పెట్రోలు, రూ.2.91 తగ్గిన డీజిల్, అలా ఇంకా తగ్గొచ్చు!

వాహన వినియోగదారులకు చల్లని కబురు. చాలా రోజుల తర్వాత పెట్రోల్ ధరలు తగ్గాయి. పెట్రోలు లీటరుకు రూ.3.77, డీజిలు లీటరుకు రూ.2.91 చొప్పున తగ్గిస్తూ చమురు మార్కెటింగ్‌ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

న్యూఢిల్లీ: వాహన వినియోగదారులకు చల్లని కబురు. చాలా రోజుల తర్వాత పెట్రోల్ ధరలు తగ్గాయి. పెట్రోలు లీటరుకు రూ.3.77, డీజిలు లీటరుకు రూ.2.91 చొప్పున తగ్గిస్తూ చమురు మార్కెటింగ్‌ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

Petrol prices

ఇది శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. స్థానిక పన్నులను కూడా పరిగణనలోకి తీసుకుంటే తగ్గింపు ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుత ముడి చమురు ధరలను, అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువను పరిగణనలోకి తీసుకుని ధరలను సవరించినట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

చమురు ధరలను చివరిసారిగా జనవరి 16న సవరించారు. ఆ రోజున పెట్రోలు ధరను లీటరుకు 54 పైసలు, డీజిలు ధరను లీటరుకు రూ.1.20 పెంచారు. ఇప్పుడు ధరలు తగ్గాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+