ఆ 5 నగరాల్లో ప్రతి రోజూ పెట్రోల్, డీజీల్ ధరల్లో మార్పులు, పెరిగిన ధరలివే

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: పెట్రోల్, డీజీల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ పై 1 పైసా,డీజీల్ పై 44 పైసలు పెంచుతున్నట్టు ఐఓసీ ప్రకటించింది. ఢీల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో సోమవారం నుండి ఈ ధరలు అమలు కానున్నట్టు ఐఓసీ తెలిపింది.

అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.అయినా పెట్రోల్, డీజీల్ ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. తాజా పెంపు ప్రకారంగా లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.68.09 లకు, కోల్ కతాలో రూ.70.68 లకు, ముంబైలో రూ.77.48, చెన్నైలో 71.17 లుగా నిర్ధారించారు.

మరో వైపు ఇంధన ధరలు ప్రతి అర్ధరాత్రి ఐదు నగరాల్లో మారనున్నాయి. దక్షిణ భారత దేశంలో పుదుచ్చేరి, వైజాగ్, పశ్చిమాన ఉదయపూర్, తూర్పున జంషెడ్ పూర్, ఉత్తరాన చంఢీఘడ్ రాష్ట్రాల్లో మే 1వ, తేది నుండి ప్రతి రోజూ పెట్రోల్, డీజీల్ ధరల్లో మార్పులు రానున్నాయి.

Petrol prices hiked by 1 paisa a litre, diesel by 44 paise

సోమవారం నాడు పెట్రోల్ చంఢీఘడ్ లో రూ.67.65, జంషెడ్ పూర్ లో రూ.69.33 , పుదుచ్చేరిలో రూ.66.02, ఉదయ్ పూర్ లో 70.57, వైజాగ్ లో 72.67 గా ఉంటుందని ఐఓసీ ప్రకటించింది.

అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో నెలకొంటున్న తీవ్ర అనిశ్చితి కారణంగా రోజుకు ఒకసారి ధరలను సమీక్షించాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకొన్నాయి.అయితే ఏప్రిల్ 16న, లీటర్ పెట్రోల్ పై రూ.1.39 పైసలు, డీజీల్ పై రూ.104 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
With the ongoing fluctuation in global crude oil rates, state-run Indian oil corporation has marginally hiked the price of transport fuels, of petrol by 1 paisa and of diesel by 44 paise both at Delhi with corresponding increases in other states, effective from today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి