జూన్ 16 నుండి పెట్రోల్, డీజీల్ కొనుగోలు బంద్: డీలర్ల సంఘం నిర్ణయం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రతిరోజూ పెట్రోల్, డీజీల్ ధరలను రోజువారీగా సవరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ బంకుల యజమానాలు ఆందోళనకు సిద్దమౌతున్నారు. ఈ నెల 16 నుండి ప్రభుత్వ చమురు సంస్థల నుండి పెట్రోల్ ,డీజీల్ కొనకూడదని నిర్ణయించారు.

జూన్ 16వ, తేది నుండి ప్రతిరోజూ పెట్రోల్, డీజీల్ ధరలను సమీక్షించాలని ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు నిర్ణయించాయి. అయితే ఈ నిర్ణయం పట్ల పెట్రోల్, డీజీల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

Petrol pumps not to buy fuel from OMCs starting June 16, may go dry

జూన్ 16 నుండి పెట్రోల్, డీజీల్ మాత్రం కొనబోమని అఖిలభారత పెట్రోలియం డీలర్ల సంఘం అధ్యక్షుడు అజయ్ బన్సాల్ చెప్పారు. అయితే ప్రయోగాత్మకంగా దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో ప్రతిరోజూ పెట్రోల్, డీజీల్ ధరలను సమీక్షిస్తున్నారు.అయితే ఈ ఐదు నగరాల్లోని పెట్రోల్,డీజీల్ పంపుల యజమానాలు చేతులు కాల్చుకొంటున్నారని అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు.అయితే ఈ ప్రతిపాదనను పునరాలోచించుకోవాలని అసోసియేషన్ కోరుతోంది.

దేశవ్యాప్తంగా 57వేల పెట్రోల్ బంకులున్నాయి. వీటిలో ఐఓసీ, బీపీసీఎల్, హెచ్ పీసీ ఎల్ సంయుక్త ఆధ్వర్యంలో 53 వేల బంకులు నడుస్తున్నాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలకు అనుగుణంగా ప్రతి 15 రోజులకు పెట్రోల్,డీజీల్ ధరలను సవరిస్తున్నాయి.

రోజూవారీ ధరలను సవరణను ప్రయోగాత్మకంగా మే 1 నుండి పుదుచ్చేరి, చంఢీగడ్, జంషెడ్ పూర్ , ఉదయ్ పూర్, విశాఖపట్టణంలో అమలుచేస్తున్నారు. ఎస్సార్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రైవేట్ సంస్థలు కూడ ఈ విధానాన్ని అనుసరించాయి.

స్టాక్ విలువ పడిపోతోందున్న భయంతో రోజువారీ ధరల సవరణకు డీలర్లు జంకుతున్నారు. తమకు కమిషన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. రోజువారీ ధరల సవరణతో పారదర్శకత పెరుగుతోందన్నారు. చిల్లర అమ్మకాల్లో ఒడిదుడుకులు చాలావరకు తగ్గుతాయని చమురు కంపెనీలు చెబుతున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Petrol pump owners in India have decided not to purchase fuel starting from June 16, protesting against the “unilateral” decision by the government to roll-out the daily revision of fuel prices nationally.
Please Wait while comments are loading...