Revenge: మసూద్ హత్యకు ప్రతీకారంగానే లీడర్ హత్య, షాహీద్ ఇంట్లో స్కెచ్ వేసి !
బెంగళూరు/ బళ్లారి: కర్ణాటకలో జరిగిన బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బళ్లారిలో జరిగిన యువకుడి హత్యకు ప్రతీకారంగా పక్కా స్కెచ్ వేసిన పీఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు ప్రవీణ్ ను హత్య చేశారని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది. బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసులో ఇప్పటి వరు 14 మందిని అరెస్టు చేశారు. ప్రవీణ్ హత్య కర్ణాటకను కుదిపేసింది.

బళ్లారి హత్యకు ప్రతీకారం
బళ్లారిలో మసూద్ అనే వ్యక్తి హత్యకు గురైనాడు. మసూద్ హత్య తరువాత పీఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు ప్రతీకారంగా హిందూ వ్యక్తులను హత్య చెయ్యాలని స్కెచ్ వేశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇదే సందర్బంలో మంగళూరు సమీపంలో నివాసం ఉంటున్న బీజేపీ నాయకుడు ప్రవీణ్ నెట్టూరును హత్య చేశారని అధికారులు అంటున్నారు.

పీఎఫ్ఐ నాయకుడు
ప్రవీణ్ హత్య కేసులో మంగళూరులో పీఎఫ్ఐ నాయకుడ షాహీద్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. బళ్లారిలో మసూద్ హత్య జరిగిన తరువాత మంగళూరులో షాహీద్ ఇంటిలో పీఎఫ్ఐ నాయకులు అందరూ సమావేశం అయ్యారని, మసూద్ హత్యకు ప్రతీకారంగా ఎవరినైనా హత్య చెయ్యాలని షాహీద్ ఇంటిలోనే చర్చించారని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ఇప్పటికే 14 మంది, లైన్ లో ఇంకా ?
బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసులో ఇప్పటి వరు 14 మందిని అరెస్టు చేశారు. ఇంకా అరెస్టు అయ్యే వాళ్లు లైన్ లో ఉన్నారని సమాచారం. ప్రవీణ్ హత్య కర్ణాటకను కుదిపేసింది. ప్రవీణ్ హత్య కేసును ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. ఎన్ఐఏ అధికారుల ఎంట్రీతో ప్రవీణ్ హత్య కేసు దర్యాప్తు వేగవంతం అయ్యింది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications