భారత్‌లో ఫైజర్ వ్యాక్సిన్ -అనుమతి కోరిన అమెరికా ఫార్మా దిగ్గజం -క్లినికల్ ట్రయల్స్ లేకుండానే
భారత్‌లో కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యాక్సిన్ల తయారీలో ఫ్రంట్ రన్నర్ గా ఉన్న అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్.. తన జర్మన్ భాగస్వామి బయోఎన్ టెక్ తో కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను ఇండియాలోనూ వాడేందుకు అనుమతి కోరింది. టీకా వినియోగానికి సంబంధించి భారత్ లో తొలి దరఖాస్తు ఇదే కావడం గమనార్హం.
Recommended Video
mRNA టెక్నాలజీతో ఫైజర్ అభివృద్ధిచ చేసిన BNT162b2 వ్యాక్సిన్ 95 శాతం సమర్థవంతగా పనిచేస్తుండటంతో దానిని వినియోగించేందుకు బ్రిటన్, బెహ్రెయిన్ దేశాలు ఇప్పటికే అనుమతులిచ్చాయి. అదే క్రమంలో భారత్ లోనూ అత్యవస వినియోగానికి అనుమతివ్వాలని కోరుతూ ఫైజర్ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. అయితే..
ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండానే ఫైజర్ అనుమతులు కోరుతుతుండటం గమనార్హం. భారత్ లో కీలక దశలో ఉన్న ఐదు వ్యాక్సిన్లు స్థానికంగానే క్లినికల్ ట్రయల్స్ జరుపుకొంటుంటం, వాటి పనితీరుపై డీసీజీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యంలో.. లోకల్ ట్రయల్స్ లేకుండా ఫైజర్ కు అనుమతి ఇస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. డిసెంబర్ 4న ఫైజర్ నుంచి దరఖాస్తు వచ్చిందని డీసీజీఐ అధికారులు ధృవీకరించారు. కాగా,

ఫైజర్-బయోఎన్ టెక్ తయారుచేసిన వ్యాక్సిన్ ను మైనస్ 72 డిగ్రీల ఉష్ణోగ్రతలో స్టోర్ చేయాల్సి ఉండటం, భారత్ లో ఆ వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన కోల్డ్ చైన్ లేకపోవడం ప్రతికూలాంశంగా ఉంది. అయితే, ఇండియాలో ఫైజర్ పంపిణీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ భాగస్వామ్యంలో మాత్రమే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు ఫైజర్ ప్రతినిధులు చెప్పారు.
ఇండియాలో ప్రస్తుతం ఐదు వ్యాక్సిన్లు కీలక దశకు చేరాయి. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరం ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన 'కొవిషీల్డ్', రష్యా తయారీ 'స్పుత్నిక్ -వి' వ్యాక్సిన్లు స్టోరేజీకి 2డిగ్రీల నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత సరిపోతుంది కాబట్టి కేంద్రం వాటివైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అదేసమయంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ పైనా కేంద్రం ఆసక్తిగా ఉంది. జైదూస్ క్యాడిలా రూపొందించిన వ్యాక్సిన్ ఇటీవలే మూడో దశ ట్రయల్స్ కు చేరగా, బయోలాజికల్-ఈ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్ లో ఉంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications