PG Girl CD: మంత్రి, సుందరి రాసలీలలు, రూ. 5 కోట్లు, ఫ్లాట్ లు డీల్, ఆ లీడర్ ఎవరంటే ?
బెంగళూరు: మంత్రి పదవితో చక్రం తిప్పుతూ ఓ వెలుగు వెలుగుతున్న రాజకీయ నాయకుడికి ఒకేఒక్క బెడ్ రూమ్ రాసలీలల సెక్స్ సీడీతో మైండ్ బ్లాక్ అయ్యింది. తన రాసలీలల సీడీ వందకు 100% నకిలి అని ఆ మాజీ మంత్రి ధీమాగా చెప్పారు. రాసలీలల సీడీ బహిరంగంగా మీడియాలో వచ్చిన తరువాత మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆ ఎమ్మెల్యే మొదటిసారి కన్నీళ్లు పెట్టుకుని మీడియా ముందుకు వచ్చారు. ఓ అమ్మాయికి విదేశాల్లో రెండు ఖరీదైన ప్లాట్ లు, రూ. 5 కోట్లు ఇచ్చి తన రాజకీయ జీవితం నాశనం చెయ్యడానికి ఓ ప్రముఖ లీడర్ చాలా కాలంగా స్కెచ్ వేశాడని మాజీ మంత్రి కన్నీళ్లు పెట్టుకుని బోరున విలపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పీజీ సుందరి రాసలీలల సీడి
కర్ణాటక రాజకీయాలను కుదిపేసి కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి సూత్రధారి అయిన రమేష్ జారకిహోళి తరువాత బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చి మంత్రి పదవితో దూసుకుపోయారు. మంత్రి పదవిలో ఉంటున్న రమేష్ జారకిహోళి బెంగళూరులోని ఆర్ టీ నగర్ పీజీ సుందరితో రాసలీలలు సాగిస్తూ అడ్డంగా బుక్కైపోయి మంత్రి పదవికి రాజీనామా చేశారు.

బాంబుపేల్చిన టాప్ లీడర్
మంత్రి పదవికి రాజీనామా చేసిన రమేష్ జారికిహోళి మంగళవారం మొదటిసారి బోరున విలపిస్తూ మీడియా ముందుకు వచ్చారు. తనను రాజకీయ సమాధి చెయ్యడానికి ఓ టాప్ లీడర్ కంకణం కట్టుకున్నాడని రమేష్ జారకిహోళి ఆరోపించారు. తాను రాజకీయంగా ఎదగడం చాలా మందికి ఇష్టంలేదని రమేష్ జారకిహోళి ఆరోపించారు.

రూ. 5 కోట్లు, రెండు ఫ్లాట్ లు డీల్
బెంగళూరులోని యశవంతపురం పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఓరాయన్ మాల్ లోని 4వ, 5వ అంతస్తులో తన మీద కుట్ర జరిగిందని, అక్కడే రాసలీలల సీడీల వ్యవహారంపై కుట్ర జరిగిందని రమేష్ జారకిహోళి ఆరోపించారు. ఓ అమ్మాయికి రూ. 5 కోట్లు, విదేశాల్లో రెండు ఖరీదైన ఫ్లాట్లు ఇచ్చి ఆమెను అడ్డం పెట్టుకుని తన మీద కక్షసాధిస్తున్నారని రమేస్ జారకిహోళి ఆరోపించారు.

నాలుగు నెలల ముందే స్కెచ్
తాను వేరే అమ్మాయితో రాసలీలలు సాగిస్తున్నట్లు ఓ సీడీ తయారు చెయ్యాలని నాలుగు నెలల క్రితమే కుట్ర జరిగిందని, ఆ విషయం తెలుసుకున్న బీజేపీ హైకమాండ్ తనను ముందుగానే హెచ్చరించిందని రమేష్ జారకిహోళి అన్నారు. నువ్వు న్యాయపోరాటానికి సిద్దంగా ఉండాలని రాసలీలల సీడీ విడుదలయ్యే 26 గంటల ముందే తనను హైకమాండ్ హెచ్చరించిందని, తాను న్యాయపోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యానని రమేష్ జారకిహోళి అన్నారు.

నా ఫ్యామిలీ ముఖ్యం.... రాజకీయాలు కాదు
మాది రాజకుటుంబం, నాకు రాజకీయాలు చెయ్యాలనే ఆసక్తిలేదని, ఇక ముందు రాజకీయాల్లో ఉంటాననే గ్యారెంటీ కూడా లేదని, తనకు తన కుటుంబం పరువు ప్రతిష్ట ముఖ్యమని రమేష్ జారకిహోళి అన్నారు. తన కుటుంబానికి మచ్చ తెచ్చినవాళ్లను ఎదుర్కొవడానికి చట్టపరంగా ఎంతదూరం అయినా వెలుతానని, తన కుటుంబం పరువు కాపాడటానికి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి తాను సిద్దం అయ్యానని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జారకిహోళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

టాప్ లీడర్ చాలెంజ్
ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు తన జీవితం నాశనం చెయ్యడానికి కక్షకట్టారని రమేష్ జారకిహోళి ఆరోపించారు. నువ్వు మంత్రి పదవిలో మూడు నెలలు మాత్రమే ఉంటావని, తరువాత నీకు కష్టాలు ఎదురౌతాయని ఆ లీడర్ కొన్ని నెలల క్రితమే చాలెంజ్ చేశారని, ఆయన అన్నట్లుగానే నాజీవితంతో చెలగాటం ఆడాడని మాజీ మంత్రి రమేష్ జారకిహోళి ఆరోపించారు.

సీఎం, మాజీ సీఎం చేశారంటే !
తన రాజకీయ జీవితంతో చెలగాటం ఆడుతున్న వారి నుంచి నువ్వు ధైర్యంగా ఉండాలని, నీకు మేము అండగా ఉన్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి తనకు ధైర్యం చెప్పారని రమేష్ జారకిహోళి అన్నారు. తన మీద కక్షతో మాజీ సీఎం కుమారస్వామి, ఆయన సోదరుడు హెచ్.డీ. రేవణ్ణ కక్ష పెంచుకోలేదని, వాళ్లు అలా చేసి ఉంటే తనతో ఎందుకు మాట్లాడుతారని మాజీ మంత్రి రమేష్ జారకిహోళి అన్నారు. మొత్తం మీద తన రాసలీలల సీడీ నూరుకు నూరుశాతం నకిలీ అని మాజీ మంత్రి రమేష్ జారకిహోళి బోరున విలపిస్తూ కన్నీళ్లు పెట్టుకుని ఆరోపించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications