వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశాల్లోని భారతీయులకు శుభవార్త - సెప్టెంబర్ 1 నుంచి ఆరో విడత వందే భారత్ - మరిన్ని దేశాలకు విమానాలు

|
Google Oneindia TeluguNews

కరోనా లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వాళ్లను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వందే భారత్ మిషన్‌ను మరో విడత పొడగించింది. వందే భారత్ మిషన్‌ ఆరో విడత విమాన సర్వీసులు సెప్టెంబర్ 1 నుంచి మొదలవుతాయని విదేశాంగశాఖ అధికారి అనురాగ్ శ్రీవాత్సవ గురువారం వెల్లడించారు.

భాయ్ చెప్పాడు.. రూ.34కోట్లు రెడీనా? - ప్రముఖ దర్శకుడికి బెదిరింపు - కారణం తెలిస్తే షాకవుతారుభాయ్ చెప్పాడు.. రూ.34కోట్లు రెడీనా? - ప్రముఖ దర్శకుడికి బెదిరింపు - కారణం తెలిస్తే షాకవుతారు

లాక్ డౌన్ కారణంగా అన్ని దేశాలూ అంతర్జాతీయ సర్వీసులను నిలిపేయగా, లక్షలాది మంది భారతీయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో కేంద్రం వందే భారత్ మిషన్ చేపట్టింది. ఇప్పటికే ఇందులో నాలుగు విడతలు పూర్తికాగా.. ప్రస్తుతం ఐదో విడత కొనసాగుతోంది. ఆగస్ట్ 31 నాటికి ఐదో ఫేజ్ ముగియనుండటంతో సెప్టెంబర్ 1 నుంచి ఆరో ఫేజ్ సర్వీసులు ప్రారంభమవుతాయని శ్రీవాత్సవ తెలిపారు.

Phase 6 of Vande Bharat Mission from Sept 1: MEA

వందే భారత్ మిషన్ ద్వారా ఇప్పటికి ఐదో విడతలో మొత్తం 22 దేశాల్లోని 23 ఎయిర్ పోర్టులకు 900 విమాన సర్వీసులు నడిచాయని, మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి బుధవారం(ఆగస్టు 26) వరకు విదేశాల్లో చిక్కుకున్న 12 లక్షలకు పైగా భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్టు శ్రీవాస్తవ వివరించారు. కాగా, ఇటీవలే కేంద్ర పౌర విమానయాన శాఖ ఇంకొన్ని దేశాలతోనూ ఎయిర్ బబుల్(అత్యవసర విమాన సర్వీసుల) ఒప్పందాల ప్రక్రియను ప్రారంభించింది. దీంతో ఆరో విడతలో మరిన్ని దేశాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

చైనా ప్రతీకార చర్య: మిస్సైల్స్ ఫైరింగ్ - అమెరికా ఉల్లంఘనకు రిటార్ట్ - ఒక మిస్సైల్ భారత్‌కు సమీపంగా.చైనా ప్రతీకార చర్య: మిస్సైల్స్ ఫైరింగ్ - అమెరికా ఉల్లంఘనకు రిటార్ట్ - ఒక మిస్సైల్ భారత్‌కు సమీపంగా.

Recommended Video

Mumbai Pilot Built A 6 Seater Aircraft On His Rooftop || Oneindia Telugu

ఇప్పటివరకు అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ, ఖతర్, మాల్దీవుల ప్రభుత్వాలతో ఎయిర్ బబూల్ ఒప్పందం చేసుకోగా.. త్వరలోనే ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్, న్యూజిల్యాండ్, నైజీరియా, బహ్రెయిన్, ఇజ్రాయెల్, కెన్యా, ఫిలిప్పీన్స్, రష్యా, సౌత్ కొరియా, థాయ్‌ల్యాండ్‌తోనూ ఎయిర్ బబూల్ ఒప్పందాలు ఖరారవుతాయని అనురాగ్ శ్రీవాత్సవ తెలిపారు.

English summary
The Ministry of External Affairs on Thursday said the phase 6 of the Vande Bharat Mission to repatriate Indians stranded abroad due to COVID-19 pandemic will begin on September 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X