PhonePe: పొలిటికల్ పార్టీలకు పేమెంట్ దిగ్గజం వార్నింగ్.. మానుకోవాలని సూచన
PhonePe: ఒకప్పుడు నేరుగా తిట్టుకున్న రాజకీయ నాయకుడు డిజిటల్ యుగంలో రూటు మార్చారు. ఎన్నికల సమయం దగ్గర పడటంతో సోషల్ మీడియా టీమ్స్ ఇస్తున్న ఐడియాలతో ప్రజలకు చేరువయ్యే క్రమంలో కొన్ని తప్పిదాలు కూడా చేస్తున్నాయి.
తాజాగా మధ్యప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య జరుగుతున్న పోస్టర్ వార్‌లో డిజిటల్ చెల్లింపు యాప్ ఫోన్ పే అడుగుపెట్టింది. సీఎం శివరాజ్ సింగ్‌కు వ్యతిరేకంగా వేసిన పోస్టర్‌లో ఫోన్‌పే లోగోను ఉపయోగించడంపై కంపెనీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి పనుల వల్ల కంపెనీ పేరు మసకబారే ప్రమాదం ఉండటంతో రంగంలోకి దిగింది. తమ అనుమతి లేకుండా లోగోను వినియోగించటంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్‌ను హెచ్చరించింది.

The PhonePe logo is a registered trademark of our company and any unauthorized use of PhonePe’s intellectual property rights will invite legal action. We humbly request @INCMP to remove the posters and banners featuring our brand logo and colour 🙏.
— PhonePe (@PhonePe) June 26, 2023
సీఎంకు వ్యతిరేకంగా ప్రచురించిన వాల్ పోస్టర్లలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఫోటో, ఫోన్-పే లోగోతో పాటు స్కానర్ ఉంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కంపెనీ తన పోస్ట్‌లో కాంగ్రెస్ పార్టీని కూడా ట్యాగ్ చేసింది. రాజకీయంగా లేదా రాజకీయేతరంగా తమ బ్రాండ్ లోగోను థార్డ్ పార్టీలు వినియోగించరాదని స్పష్టం చేసింది. తమ వ్యాపారానికి ఎలాంటి రాజకీయ ప్రచారం లేదా పార్టీతో సంబంధం లేదని కంపెనీ చెబుతోంది. కంపెనీ లోగో రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ కావటంతో అనధికారిక ఉపయోగం చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు పేమెంట్స్ ఫిన్ టెక్ కంపెనీకి ఉంటుంది.
ఆన్‌లైన్ చెల్లింపులను ఆమోదించడానికి ఫిన్‌టెక్ కంపెనీలు ఉపయోగించే క్యూఆర్ కోడ్ షీట్‌ల రూపంలో పోస్టర్‌లు అతికించబడ్డాయి. దీనిపై గ్వాలియర్‌లోని పడవ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఫోన్‌పే ఫిర్యాదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై చర్యలు తీసుకుంటుందని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించినట్లు వార్తా సంస్థలు తెలిపాయి. వీటిని కాంగ్రెస్ నేతలు అంటించినట్లు సీసీటీవీ ఫుటేజీలో వెల్లడైందని హోంమంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications