వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాథ్రస్ అత్యాచార ఘటన రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్..? ఏం జరుగుతోంది..?

|
Google Oneindia TeluguNews

హాథ్రస్ అత్యాచార ఘటనపై రిపోర్టింగ్ చేయరాదంటూ తొలుత ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో మృతురాలి కుటుంబ సభ్యులను కలిసేందుకు మీడియాకు అనుమతి ఇచ్చింది. అంతకుముందు ఓ జాతీయ ఛానెల్‌కు చెందిన మహిళా జర్నలిస్టుకు సంబంధించిన ఫోన్ ట్యాప్ అయిందనే వార్తలు రావడంతో ఇది వాస్తవమేనని సదరు ఛానెల్ ధృవీకరించింది.

హాథ్రస్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే ఆ ఘటనపై పూర్తిగా కవర్ చేయకుండా మీడియాపై ఆంక్షలు విధించడం జరిగింది. ఓ జాతీయ ఛానెల్‌కు చెందిన తనుశ్రీ పాండే అనే మహిళా రిపోర్టర్ మృతురాలి సోదరుడితో ఫోన్‌లో మాట్లాడింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తమ కుటుంబంపై ఒత్తిడి తీసుకొస్తోందంటూ మృతురాలి సోదరుడు తనుశ్రీ పాండేకు ఫోనులో చెప్పాడు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ టేపు బయటకు లీకైంది. అంతేకాదు దీన్ని ఓ వర్గపు సంస్థ సర్క్యులేట్ చేసింది.ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తమపై ఒత్తిడి తీసుకొస్తోందని చెప్పాలంటూ మహిళా రిపోర్టర్ తనుశ్రీ పాండే ... మృతురాలి కుటుంబ సభ్యులను బలవంతం చేస్తోందని పేర్కొంటూ సోషల్‌ మీడియాలో సర్క్యులేట్ చేశారు. దీనిపై ఆ సదరు ఛానెల్ స్పందించింది.

Phones of Journalists reporting the Hathras incident being tapped by UP Govt,Audio tapes on SM

హాథ్రస్ ఘటన మృతురాలి సోదరుడితో తమ రిపోర్టర్ మాట్లాడింది వాస్తవమేనని అయితే ఆమె మాటలను కొందరు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేసింది సదరు ఛానెల్. మృతురాలి సోదరుడితో మాట్లాడినప్పుడు ఆమె ఏం జరిగిందో చెప్పాలని అడిగిందని అందుకు సమాధానంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తమ కుటుంబ సభ్యలపై ఒత్తిడి తీసుకొస్తోందని సమాధానంగా చెప్పినట్లు ఛానెల్ పేర్కొంది. తన తండ్రి మాట్లాడుతున్న సమయంలో వీడియోను రికార్డు చేయాలని తనుశ్రీ మృతురాలి సోదరుడికి సూచించిందని ఛానెల్ స్పష్టం చేసింది. అంతేకాదు ప్రస్తుతం కేసులో జరుగుతున్న విచారణపై తృప్తితో ఉంటే దానిపై కూడా ఒక ప్రకటన రికార్డు చేసి విడుదల చేయాలని తనుశ్రీ ఫోనులో మాట్లాడిన సమయంలో చెప్పిందని ఛానెల్ క్లారిటీ ఇచ్చింది.

ఇదంతా ఇలా ఉంటే.... అసలు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఘటనను కవర్ చేస్తున్న జర్నలిస్టుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేస్తోందటూ ప్రశ్నించింది సదరు ఛానెల్. ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణను రికార్డు చేయాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించింది. ఒకవేళ ట్యాప్ చేసి ఉంటే హథ్రాస్ ఘటన మృతురాలి కుటుంబ సభ్యలు ఫోన్‌ను మాత్రమే ఎందుకు ట్యాప్ చేస్తోందని ప్రశ్నించింది. ట్యాప్ చేశాక ఈ ఫోన్ రికార్డింగులను సోషల్ మీడియాలో ఎందుకు లీక్ చేశారని ఆ అధికారం ఏ చట్టమిచ్చిందని ప్రశ్నించింది.


ఇక మృతురాలి కుటుంబ సభ్యులను కలిసేందుకు మీడియాకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో ఎట్టకేలకు మృతురాలి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించారు. దీంతో మీడియా మృతురాలి కుటుంబ సభ్యులను కలిశారు.

Recommended Video

#Watch PM Narendra Modi Inaugurates Atal Tunnel at Rohtang వాజ్‌పేయ్‌ కల సాకారం..!! || Oneindia

English summary
Television news channel India Today on Friday issued a statement after a conversation between its journalist Tanushree Pandey and the Hathras victim’s brother was leaked online and carried in an article by a right-wing organisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X