సద్దులకి సిద్ధం చేయాలని కేసీఆర్, గాంధీ కలకోసం మోడీ

హైదరాబాద్: సద్దుల బతుకమ్మను తెలంగాణవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, చెరువుల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారులను బుధవారం ఆదేశించారు. గురువారం నాటి సద్దుల బతుకమ్మకు తెలంగాణవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సద్దుల బతుకమ్మ నిర్వహణ పైన సచివాలయంలో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల సీనియర్ అధికారులు బీపీ ఆచార్య, శ్రీధర్, జోషి, లవ్ అగర్వాల్, మీనా, రాళ్లబండి కవితా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాదులో జరిగే ప్రధాన ఉత్సవంలో కేసీఆర్, గవర్నర్ నరసింహన్ పాల్గొంటారు.

బతుకమ్మ

బతుకమ్మ

సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియం నుండి ఊరేగింపు ప్రారంభం అవుతుంది. సాంప్రదాయ బద్దంగా గౌరమ్మను పూజించి, మంగళవాయిద్యాలతో బతుకమ్మల ఊరేగింపు సాగిపోతుంది. బతుకమ్మ నిమజ్జనం కోసం ట్యాంకుబండు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్యాంకుబండు వైపు వాహనాల రాకపోకలను నిషేధించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ విద్యుత్ అలంకరణలు చేస్తున్నారు. బతుమ్మ పాటలు మారుమ్రోగే విధంగా సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్లో లేజర్ షో నిర్వహించనున్నారు.

బతుకమ్మ

బతుకమ్మ

శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక నిఘా పెట్టామని, సీసీ కెమెరాల ద్వారా కమిషనరేట్ నుండి ప్రతి క్షణం, ప్రతి అంగుళం పరిశీలిస్తామని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించాలని సీఎం అధికారులకు చెప్పారు. ముఖ్యంగా బతుకమ్మలు నిమజ్జనం చేసే చెరువుల వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని, పోలీసులను నియమించాలని, చెరువులకు వెళ్లే మార్గాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

బతుకమ్మ

బతుకమ్మ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్ం బతుకమ్మ పండుగ నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ బిడ్డలు పండుగను సంతోషంగా నిర్వహించుకున్నారని కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ దేశాలలో బతుకమ్మ పండుగను నిర్వహించుకున్న సమాచారం తమకు అందిందన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక వెబ్ సైట్లలో బతుకమ్మకు సంబంధించిన చర్చ బాగా జరిగిందన్నారు.

బతుకమ్మ

బతుకమ్మ

గూగుల్‌తో పాటు ఇతర సెర్చ్ ఇంజిన్లలో కూడా బతుకమ్మ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఎక్కవ ఆసక్తి చూపారని, ఈసారి సద్దుల బతుకమ్మ ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించుకోవడంపై దృష్టి పెట్టాలని కేసీఆర్ సూచించారు. వచ్చే ఏడాది మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్నారు. వచ్చే ఏడాది నాటికి హుస్సేన్ సాగర్ తీరంలో బతుకమ్మ స్క్వేర్ నిర్మించాలని చెప్పారు.

మోడీ-వెంకయ్య

మోడీ-వెంకయ్య

గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ రాజ్‌ఘాట్‌ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన తర్వాత వాల్మీకి బస్తీకి వెళ్ళి అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని వెంకయ్య నాయుడు తెలిపారు. తర్వాత ఇండియా గేట్‌ వద్ద జరిగే కార్యక్రమంలో మోడీ పాల్గొన్ని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారన్నారు.

స్మృతి

స్మృతి

ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు స్వచ్ఛ భారత్ కోసం చీపురు పట్టిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రవిశంకర ప్రసాద్, హర్‌స్మిరాత్ కౌర్ బాదల్, రామ్ విలాస్ పాశ్వాన్, ఉమా భారతి, అశోక గజపతి రాజు తదితరులు చీపురు పట్టారు. ఢిల్లీలోని సర్ధర్‌ జంగ్‌ విమానాశ్రయం వద్ద బుధవారం జరిగిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం ముడిపడి ఉందన్నారు. గతంలో టీడీపీ చేపట్టిన పచ్చదనం పథకమే కేంద్రస్థాయికి చేరిందన్నారు. ఈ పథకం విజయవంతానికి అందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.

ఎల్బీ స్టేడియంలో గురువారం ఉదయం ఉదయం ఎనిమిది గంటలకు నుండే బతుకమ్మలు పేర్చడం ప్రారంభించాలని కేసీఆర్ చెప్పారు. ఇందుకు కావాల్సిన పూలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఎల్పీ స్టేడియం నుండి 25వేల మంది మహిళలు బతుకమ్మలతో ట్యాంక్‌బండ్ వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులోనే 10 జిల్లాల నుంచి వచ్చిన శకటాలు పాల్గొంటాయి. వందలాది మంది కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించుకుంటూ ఊరేగింపులో భాగం అవుతారు.

మరోవైపు, బుధవారం నాడు ఇండియా గేట్ వద్ద ప్రతిష్టాత్మక స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనిలో పాల్గొని విజయవంతం చేయాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పిలుపు ఇళ్లు, కార్యాలయాలు అన్నీ ప్రాంతాలను క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా ఉంచాలని కోరారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాలు దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రారంభించాలని, మహాత్మా గాంధీకి మనమిచ్చే అసలైన నివాళి ఇదే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+