వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ అతలాకుతలం:మోడీ సాయం, పాక్‌కూ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ వరదలను జాతీయ స్థాయి విపత్తుగా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజల ఆవేదనతో పాలు పంచుకుంటూ పునరావాస చర్యల కోసం వెయ్యి కోట్ల ప్రత్యేక సాయాన్ని ప్రకటించారు.

రాష్ట్రంలో వరద పరిస్థితిని స్వయంగా తెలుసుకోవడం కోసం ఆదివారం రాష్ట్రంలో పర్యటించిన అనంతరం ప్రధాని శ్రీనగర్‌లో ఈ ప్రకటన చేశారు.

గత ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో 160 మందికి పైగా మృతి చెందగా, వేలాది మంది వరద తాకిడికి గురయ్యారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

రాష్ట్రానికి ప్రత్యేక సాయాన్ని ప్రకటించిన ప్రధాని ఈ విపత్తును ఎదుర్కోవడానికి రాష్ట్రాలు చేతనయిన సాయం అందించాలని కోరారు. పొరుగున ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారీ వరదల కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణనష్టం సంభవించడంపై మోడీ ఆవేదన వ్యక్తం చేశారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

పాకిస్తాన్ కనుక కోరినట్లయితే వరద బాధిత ప్రాంతాలకు మానవతా సాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని మోడీ ప్రకటించారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాదికారులు, జమ్మూ, శ్రీనగర్‌లో వరదల కారణంగా సంభవించిన నష్టం గురించి వివరించినప్పుడు మోడీ ప్రజల ఆవేదనతో పాలు పంచుకున్నట్లు పిఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

వరద నష్టం చాలా తీవ్రంగా ఉన్న దృష్ట్యా రాష్ట్ర విపత్తుల సహాయ నిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి లభిస్తున్న 1100 కోట్ల రూపాయలు ఏమాత్రం సరిపోదని మోడీ అంటూ, సహాయ, పునరావాస చర్యలు చేపట్టడం కోసం రాష్ట్రానికి వెయ్యి కోట్ల రూపాయల ప్రత్యేక ప్రాజెక్టు సహాయ రూపంలో అందజేయడం జరుగుతుందని చెప్పారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

అంతేకాదు, పరిస్థితిపై సమగ్ర సర్వే నిర్వహించిన తర్వాత మరింత సాయాన్ని అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. వరద పరిస్థితిని జాతీయ స్థాయి విపత్తుగా అభివర్ణించిన ఆయన ఈ క్లిష్ట సమయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి,ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రెండేసి లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 50 వేల రూపాయలు చొప్పున అందజేయడం జరుగుతుందని, ఈ సహాయాన్ని ఫ్రదాని సహాయ నిధినుంచి ఇస్తామని చెప్పారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఇళ్లు కోల్పోయిన వారికి నీడ కల్పించడం కోసం సాయుధ దళాలు, సిఆర్‌పిఎఫ్‌నుంచి 2 వేల టెంట్లను సమకూరుస్తామని మోదీ చెప్పారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

సోమవారం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించడం జరుగుతుందని, ఈ చలి వాతావరణంలో అవసరమైన వారికి లక్ష బ్లాంకెట్లను కొనుగోలు చేయడానికి ప్రధాని సహాయ నిధినుంచి 5 కోట్ల రూపాయలు అందజేస్తామని ప్రధాని చెప్పారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

చిన్న పిల్లలకు ఆహారాన్ని అందజేయడం కోసం కేంద్రం విమానం ద్వారా 50 టన్నుల పాలపొడిని రాష్ట్రానికి పంపిస్తుందని, అవసరమైతే ఆ తర్వాత మరింత సరఫరా చేస్తామని చెప్పారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

వీలయినంత త్వరగా వరద పీడిత ప్రాంతాలకు టెలీ కమ్యూనికేషన్ సదుపాయాలను పునరుద్ధరించాలని టెలికాం శాఖ బృందాలను ఆదేశించడం జరిగిందని, అలాగే దెబ్బతిన్న వంతెనలను మరమ్మతు చేయడానికి ఆర్మీ ఇంజనీర్లు కృషి చేస్తున్నారన్నారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

వరదల కారణంగా ఎంత నష్టం జరిగిందో, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను శుక్రవారం రాష్ట్రంలో పర్యటించిన హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తనకు వివరించారని ఆయన చెప్పారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

పరిస్థితి తీవ్రత దృష్ట్యా క్యాబినెట్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి సహాయక సామగ్రిని తీసుకు వచ్చే విమానాలు తిరుగుప్రయాణంలో వరద ప్రాంతాల్లో చిక్కుపడిన పర్యాటకులను తీసుకెళ్తాయని చెప్పారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

సైన్యం, ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది పూర్తి సమన్వయంతో చేపడుతున్న సహాయ, పునరావాస చర్యలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

జమ్మూ కాశ్మీర్ వరదలను జాతీయ స్థాయి విపత్తుగా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజల ఆవేదనతో పాలు పంచుకుంటూ పునరావాస చర్యల కోసం వెయ్యి కోట్ల ప్రత్యేక సాయాన్ని ప్రకటించారు.

English summary
Jammu and Kashmir, hit by severe floods, is facing one of the worst natural disasters in its history. The prime minister has called it a "national-level disaster." Around 150 people have been killed in the floods and heavy rains in the state so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X