వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్‌లో బాబు: చేయీ చేయీ కలిపితే.. (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జపాన్, ఆంధ్రప్రదేశ్ చేతులు కలిపితే అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం అనేక సంస్థల ప్రతినిధులతో, అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫుకువొకా నగరంలో కీలక అధికారులతో భేటీ అయ్యారు. భేటీలో చంద్రబాబు మాట్లాడారు. జపాన్, భారత్ మధ్య సాంస్కృతిక సారూప్యత ఉందని, జపాన్, ఆంధ్ర మధ్య మరికొన్ని పోలికలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

భౌగోళిక ఆకృతి, వేయి కిలోమీటర్ల సాగరతీరం, కష్టించి పనిచేసే మనస్తత్వం వంటివి రెండు ప్రాంతాల్లోనూ ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించే రాజధానిలో 13 స్మార్ట్ సిటీల నిర్మాణానికి జపాన్ సాయం కావాలన్నారు. అలాగే అపురూపమైన ప్రకృతి రమణీయతకు కొలువైన విశాఖ నగరం అభివృద్ధికీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త రాజధాని నిర్మాణంలో తమ విజ్ఞానాన్ని పంచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్యుకోకో నగర డిప్యూటీ మేయర్ అత్సుహికో సదకరి ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచంలో గుర్తించిన 38 ఉత్తమ నగరాల్లో ప్యుకోకో కూడా ఒకటని వ్యాఖ్యానించారు.

ఐటి రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండగా, ఆటోమొబైల్ రంగంలో జపాన్ అగ్రగామిగా ఉందని ప్యుకోకో పర్‌ఫెక్చర్ ఇంటర్నేషనల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అఖికో ప్యుకుషిమా అన్నారు. కొత్త రాజధానిలో తమ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని పంచుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్, ప్యుకోకో మధ్య సంబంధాలు రానున్న రోజుల్లో మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

జపాన్ పర్యటనలో బాబు

జపాన్ పర్యటనలో బాబు

భారత్‌తో జపాన్ సంబంధాలు మెరుగుపడ్డాయని, 36 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామంటూ జపాన్ ప్రధాని చేసిన ప్రకటన హర్షణీయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

జపాన్ పర్యటనలో బాబు

జపాన్ పర్యటనలో బాబు

శాన్‌కో స్మార్ట్ వాటర్ రిజర్వాయర్‌ను చంద్రబాబు నాయుడు సందర్శించారు. అక్కడ అనుసరిస్తున్న వరద నిర్వహణ విధానాలను అధ్యయనం చేశారు. వరద నిర్వహణలో ప్యుకోకో నగరం ఒక నమూనాగా అభివర్ణించారు.

జపాన్ పర్యనలో బాబు

జపాన్ పర్యనలో బాబు

ఎంత భారీ వర్షాలు కురిసినా, వరదలు వచ్చినా ఆ నీటిని ప్యుకోకా నగరంలోని ఒక జలాశయంలోకి మళ్లించే విధానం వల్ల నగరంలో చుక్క నీరు కూడా నిల్వ ఉండదని అక్కడి అధికారులు వివరించారు. 2009లో భారీ వరదలు వచ్చినా నగరంలో ఒక్క చుక్క నీరు కూడా నిల్వ ఉండలేదని గుర్తుచేశారు.

జపాన్ పర్యటనలో బాబు

జపాన్ పర్యటనలో బాబు

ప్యుకోకా నగరంలోని విధానాలను పరిశీలించిన చంద్రబాబు రాష్ట్రంలో నిర్మించే 13 స్మార్ట్ సిటీల్లో ప్యుకోకో వరద నిర్వహణ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.

జపాన్ పర్యటనలో బాబు

జపాన్ పర్యటనలో బాబు

విద్యుత్ పొదుపులో కీలక పాత్ర పోషిస్తున్న కిడాక్యుషు స్మార్ట్ గ్రిడ్‌ను చంద్రబాబు బృందం అధ్యయనం చేసింది. విద్యుత్ అవసరాలను 24 గంటలకు ముందుగానే అంచనా వేసే విధానాన్ని ఆయన పరిశీలించింది.

జపాన్‌ పర్యటనలో బాబు

జపాన్‌ పర్యటనలో బాబు

కిడాక్యుషు స్మార్ట్ గ్రిడ్ విషయంలో చాలా విషయాలు తెలిశాయి. డిమాండ్ తగ్గుతున్నట్లు గుర్తిస్తే వేరే గ్రిడ్‌లకు విద్యుత్ అందించడం, డిమాండ్ పెరిగే పరిస్థితి ఉంటే ఇతర గ్రిడ్‌ల నుంచి విద్యుత్‌ను పొందేలా అక్కడ చర్యలు తీసుకుంటున్నారు.

జపాన్ పర్యటనలో బాబు

జపాన్ పర్యటనలో బాబు

రాష్ట్రంలో విద్యుత్ నిర్వహణపై చంద్రబాబు వివరిస్తూ, నిర్వహణ బాగానే ఉన్నప్పటికీ భవిష్యత్ డిమాండ్‌ను ముందుగానే అంచనా వేసేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని వివరించారు.

జపాన్ పర్యటనలో బాబు

జపాన్ పర్యటనలో బాబు

హర్యానాలో ఫ్యుజి సంస్థ ఏర్పాటుచేసిన గ్రిడ్ మాదిరిగానే ఆంధ్రలోనూ స్మార్ట్ గ్రిడ్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చంద్రబాబు కోరారు.

జపాన్ పర్యటనలో బాబు

జపాన్ పర్యటనలో బాబు

కిటాక్యుషు నగర మేయర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దిన తీరును అధ్యయనం చేశారు. దీనివల్ల పర్యాటకగానే కాకుండా ఆర్ధికంగానూ అభివృద్ధి ఉంటుందని మేయర్ వివరించారు.

జపాన్ పర్యటనలో బాబు

జపాన్ పర్యటనలో బాబు

ప్రపంచంలోనే తక్కువ కార్బన్ ఉన్న నగరంగా కిటాక్యుషు ప్రసిద్ధి చెందింది. హైడ్రోజన్ ఇంధన వినియోగంపైనా బాబు అడిగి తెలుసుకున్నారు.

జపాన్ పర్యటనలో బాబు

జపాన్ పర్యటనలో బాబు

స్మార్ట్ మీటరింగ్, డిమాండ్‌కు తగినట్లు విద్యుత్ నిర్వహణ, పర్యావరణ విధానాలను పాటించిన వినియోగదారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు అక్కడి అధికారులు వివరించారు.

జపాన్ పర్యటనలో బాబు

జపాన్ పర్యటనలో బాబు

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని కూడా గ్రీన్ సిటీగా తీర్చి దిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. అక్కడ పర్యావరణానికి పెద్దపీట వేస్తామన్నారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu visited several institutions in Japan and met officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X