PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!
ఇరాన్ వార్ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) సిలెండర్ల కొరత కనిపిస్తోంది. ఇప్పటికే కమర్షియల్ సిలెండర్లు వాడుతున్న హోటల్స్ రేట్లు పెంచేయడమో లేక మూత పడటమో చేస్తున్నాయి. గృహవినియోగదారులు సైతం గ్యాస్ సిలెండర్లు లేక అల్లాడుతున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రోజూ ప్రెస్ మీట్లు పెట్టి ఎల్పీజీ కొరత లేదని చెప్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
పైప్డ్ నేచురల్ గ్యాస్ ( PNG) అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఇంకా ఎల్పీజీ సిలెండర్లు వాడుతున్న వారికి కేంద్రం షాకిచ్చింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ అందుబాటులో ఉన్నా తీసుకోకుండా ఎల్పీజీ సిలెండర్లు వాడుతున్న వారికి ఇకపై వాటిని సరఫరా చేయబోమని తేల్చిచెప్పేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. అయితే వీటికి మూడు నెలల గడువు ఇస్తున్నట్లు తెలిపింది.

సహజ వాయువు అందుబాటులో ఉన్నచోట వినియోగదారులు దానికి మారడంలో విఫలమైతే, ఎల్పీజీ సరఫరాను నిలిపివేస్తామని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోకా పీఎన్జీకి మారకపోతే ఎల్పీజీ గ్యాస్ సిలెండర్లు సరఫరా చేయబోమని డెడ్ లైన్ పెట్టేసింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో సహజవాయువుకు మారాలని ప్రజల్ని, వ్యాపారులను కోరుతున్నాయి. ఇప్పుడు కేంద్రం ఏకంగా డెడ్ లైన్ పెట్టేయడంతో ఇక పీఎన్జీ అందుబాటులో ఉన్న వారంతా తప్పనిసరిగా ఎల్పీజీని వదులుకోవాల్సిన పరిస్ధితి ఎదురుకానుంది.












Click it and Unblock the Notifications